Vijay Sethupathi 50 titled as Maharaja: సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు చేసే స్థాయి నుంచి హీరోగా మారి మక్కల్ సెల్వన్ అనే పేరు సంపాదించాడు విజయ్ సేతుపతి. తన సహజ నటనతో కేవలం తమిళంలోనే కాదు తెలుగులో సైతం ఫ్యాన్స్ ను సొంతం చేసుకున్న సేతుపతి ఒక పక్క హీరోగా మరోపక్క విలన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా అన్ని రకాల పాత్రాలు చేస్తూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇక తాజాగా ఆయన 50వ సినిమా టైటిల్ ఫిక్స్ చేస్తూ మేకర్స్. ఆ సినిమాకి మహారాజా(Maharaja) అనే టైటిల్ ఫిక్స్ చేసినట్టు టైటిల్ పోస్టర్ రిలీజ్ చేశారు. పోస్టర్ లో ‘చుట్టూ ఏముందో అదే వస్తుంది’ అంటూ ఇంగ్లీష్ లో పేర్కొని ఉండడమే కాకుండా ఒక రాజు, ఆ రాజు తలపై చదరంగపు పావు, దానిపై ఓ పక్షి ఉండడం సినిమా మీద ఆసక్తి పెంచేసింది.
Laal Salam: అప్పుడే ‘లాల్ సలాం’ పూర్తి చేసేసిన రజినీకాంత్
ఇక ఈ సినిమాకి దర్శకుడు నితిలన్ స్వామినాథన్ డైరెక్టర్ గా వ్యవహరిస్తుండగా ఈ మూవీ షూటింగ్ ఇప్పటికే పూర్తి చేసుకున్నట్లు చెబుతున్నారు. షూట్ పూర్తి చేసుకున్న ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు ప్రస్తుతానికి శరవేగంగా జరుగుతున్నాయి. ప్యాషన్ స్టూడియోస్ నిర్మించిన ఈ సినిమాలో విజయ్ సేతుపతి, అనురాగ్ కశ్యప్, మమతా మోహన్ దాస్ సహా నట్టి నటరాజ్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. వీరు మాత్రమే కాకుండా అభిరామి, అరుల్ దాస్, మునిష్కాంత్, బాయ్స్ మణికందన్, సింగం పులి, భారతీరాజా, వినోద్ సాగర్, పిఎల్ తేనప్పన్ వంటి వారు ముఖ్యమైన పాత్రలలో కనిపించనున్నారు.