Vijay Devarakonda: విజయ్ దేవరకొండ.. ప్రస్తుతం ఈ పేరు సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. కొంతమంది విజయ్ ను ప్రశంసిస్తున్నారు.. మరికొంతమంది విమర్శిస్తున్నారు. ఏ విధంగా చూసుకున్నా గతకొన్నిరోజుల నుంచి ఈ హీరో పేరు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతూనే వస్తోంది. ఎన్నో ఆశలు పెట్టుకొని రిలీజ్ చేసిన లైగర్ విజయ్ కీ షాక్ ఇచ్చింది. విడుదలైన మొదటి రోజే ప్లాప్ టాక్ తెచ్చుకొని భారీ పరాజయాన్ని చవిచూసింది. మునుపెన్నడూ చూడని నష్టాలను ఈ సినిమా నిర్మాతలు చవిచూశారు. ఇక ఈ నేపథ్యంలోనే విజ్జయి దేవరకొండ ఒక కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాకు పెట్టుబడి పెట్టి నష్టపోయిన నిర్మాతలకు తనవంతు సాయం చేశాడట రౌడీ హీరో. లైగర్ కు తనకు ఇచ్చిన పారితోషికంలో సగ భాగం నిర్మాతలకు తిరిగి ఇచ్చేసినట్లు టాక్ నడుస్తోంది. దాదాపు రూ. 6 కోట్లు విజయ్, పూరికి తిరిగి ఇచ్చాడట.
ఇక పూరి సైతం ఆ డబ్బును నష్టపోయిన డిస్ట్రిబ్యూటర్లకు సర్దుబాటు చేయనున్నాడని సమాచారం. త్వరలోనే ఒక మీటింగ్ పెట్టి నష్టాలను కొంతవరకు భర్తీ చేసే ప్రణాళికల గురించి చర్చించనున్నారట. ఇక ఈ విషయం తెలియడంతో విజయ్ అభిమానులు అతడిని ఆకాశానికెత్తేస్తున్నారు. హీరో అంటే అలా ఉండాలి. సక్సెస్ నే కాదు నష్టాలను కూడా భరించాలి. ఏ హీరో ఇస్తాడు ఇలాగా అంటూ కామెంట్స్ పెడుతున్నారు. ఇకపోతే ప్రస్తుతం విజయ్- పూరి తదుపరి ప్రాజెక్ట్ జనగణమణ కూడా ప్రొడ్యూసర్స్ లేక ఆగిపోయినట్లు వార్తలు వస్తున్నాయి. మరి ఈ వార్తల్లో నిజం ఎంత అనేది తెలియాల్సి ఉంది.