Site icon NTV Telugu

Nagavamsi : విజయ్ కోసం ఎన్టీఆర్ సినిమాపై సైలెంట్..?

Kingdom

Kingdom

Nagavamsi : విజయ్ దేవరకొండ కోసం ఎన్టీఆర్ సినిమాపై సితార సంస్థ సైలెంట్ అవుతోందా అంటే అవుననే అంటున్నారు ఫ్యాన్స్. విజయ్ దేవరకొండ నటించిన కింగ్ డమ్ మూవీని నిర్మించింది సితార సంస్థ నాగవంశీ. అలాగే జూనియర్ ఎన్టీఆర్ నటించిన వార్-2 సినిమా తెలుగు రైట్స్ ను సొంతం చేసుకుంది కూడా నాగవంశీనే. వార్-2 ఆగస్టు 14న రిలీజ్ కాబోతోంది. అంటే ఇంకా నెల రోజులు కూడా లేదు. కానీ ప్రమోషన్లు ఇంకా స్టార్ట్ కాలేదు. దీనికి యష్ రాజ్ నుంచి సరైన ప్రమోషన్ కంటెంట్ రాలేదని పైకి సితార చెబుతోంది. కానీ అసలు కారణం వేరే ఉంది. కింగ్ డమ్ మూవీ జులై 31న రిలీజ్ కాబోతోంది. ఇప్పటికే రెండు సార్లు వాయిదా పడ్డ తర్వాత వస్తోంది.

Read Also : Pawan Kalyan : ఛీ..ఛీ.. అంటూ పవన్ పై ప్రకాశ్ రాజ్ ట్వీట్.. జనసేన కౌంటర్..

పెద్దగా టైమ్ కూడా లేదు. ఈ గ్యాప్ లోనే ప్రమోషన్లు, ఈవెంట్లు, ప్రీ రిలీజ్, ఇంటర్వ్యూలు, మీడియా ప్రెస్ మీట్లు, ఇతర రాష్ట్రాల్లో చీఫ్‌ గెస్టులను పిలిచి అక్కడ ప్రమోషన్లు చేసుకోవడాలు.. ఇలా చాలానే ఉన్నాయి. నాగవంశీ ప్రస్తుతం ఆ పనుల్లోనే బిజీగా ఉన్నాడంట. కింగ్ డమ్ కు సొంత నిర్మాత కాబట్టి నాగవంశీ ఆ మూవీని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని ఫుల్ టైమ్ దానికే కేటాయిస్తున్నట్టు తెలుస్తోంది. అందుకే వార్-2 ప్రమోషన్లు ఇంకా స్టార్ట్ చేయట్లేదు. ఈ విషయంపై ఎన్టీఆర్ ఫ్యాన్స్ కొంత ఫైర్ మీద ఉన్నారు. ఎందుకంటే వార్-2కు పోటీగా వస్తున్న రజినీకాంత్ కూలీ మూవీ పాటలతోనే హైప్ పెంచేస్తోంది. పైగా కూలీ మూవీలో నాగార్జున, ఉపేంద్ర, అమీర్ ఖాన్ లాంటి స్టార్లు బలంగా ఉన్నారు. వారందరి మార్కెట్ ను తట్టుకుని వార్-2 పెద్ద సక్సెస్ కావాలంటే ప్రమోషన్లు పెంచాల్సిందే అంటున్నారు. కానీ ఆగస్టు 1 దాకా సితార సంస్థ వార్-2పై ఇంట్రెస్ట్ చూపించే అవకాశాలు అయితే కనిపించట్లేదు.

Read Also : Ronith Roy : తిండిలేక ఇబ్బందులు పడ్డా.. ప్రముఖ నటుడు కామెంట్స్

Exit mobile version