Vijay Devarakonda: 12th ఫెయిల్ సినిమాపై విజయ్ ప్రశంసలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Vijay Devarakonda: బాలీవుడ్ టాలెంటెడ్ నటుడు విక్రాంత్ మాస్సే, మేధా శంకర్ జంటగా ప్రముఖ ఫిల్మ్ మేకర్ విధు వినోద్ చోప్రా తెరకెక్కించిన చిత్రం 12th ఫెయిల్. ముంబై క్యాడర్ కు చెందిన అసిస్టెంట్ పోలీస్ కమిషనర్ మనోజ్ కుమార్ శర్మ లైఫ్ లో జరిగిన వాస్తవ సంఘటనల ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది. ఓ చిన్న పల్లెటూరికి చెందిన మనోజ్.. ఎలాంటి సపోర్ట్ లేకుండా సివిల్స్‌కి ఎంపికై అందరికి ఆదర్శంగా నిలిచాడు. అయితే ఆయన సివిల్స్‌కి ప్రిపేర్ అయిన సమయంలో పడిన కష్టాల నేపథ్యంలో ఈ చిత్రం సాగుతుంది. ఇందులో ఎన్నో ఎమోషన్స్ కలగలిపాడు దర్శకుడు. ఒక విజయాన్ని సాదించాలి అంటే ఎన్నో కష్టాలను ఎదుర్కోవాలి అని, పట్టుదల ఉంటే ఏదైనా సాధించవచ్చు అని, నిజమైన ప్రేమ.. కష్టాలను చూసి పారిపోదు అని.. ఇలా ఈ సినిమా ప్రతి ఒక్కరికి ఇన్స్పిరేషన్ గా నిలిచింది. రూ. 20 కోట్ల బడ్జెట్‌తో నిర్మించిన ఈ చిత్రం అక్టోబర్ 23 న రిలీజ్ అయ్యి ప్రపంచ వ్యాప్తంగా రూ. 67 కోట్లను వసూలు చేసింది. డిసెంబర్ 29 నుంచి ప్రముఖ ఓటీటీ డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. ఇక్కడ కూడా తన సత్తా చాటుతోంది. ఎంతోమంది సెలబ్రిటీలు సైతం ఈ సినిమాను ప్రశంసిస్తున్నారు.
తాజాగా విజయ్ దేవరకొండ ఈ సినిమాను ప్రశంసిస్తూ ట్వీట్ చేశాడు. ” పిల్లల భవిష్యత్తు కోసం పోరాడుతున్న ప్రతి తల్లి, తండ్రి మరియు అమ్మమ్మలకు.. మరొకరికి స్ఫూర్తినిచ్చే ప్రతి దుష్యంత్ సర్‌కి.. పాండే మరియు గౌరీ భాయ్ వంటి ప్రతి స్నేహితుడికి..శ్రద్ధా లాంటి అమ్మాయికి మరియు అక్కడ ఉన్న ప్రతి మనోజ్‌కి.. నా ప్రేమను అందిస్తున్నాను.మీరు ప్రతి పోరాటాన్ని అధిగమించి విజయం సాధించండి.. #12thFail యొక్క తారాగణం మరియు బృందానికి – ధన్యవాదాలు” అంటూ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట వైరల్ గా మారింది.
Also Read
12th fail ❤️
To every mother, father and grandmother fighting for their kids future.
To every Dushyanth sir who inspires another.
To every friend like Pandey and Gauri bhai.
To every blessing that is Shradda.
And to every Manoj out there.. my heart and prayers go out to…
— Vijay Deverakonda (@TheDeverakonda) January 14, 2024
తాజావార్తలు
-
AP Municipal Elections 2026: సీట్ల సర్దుబాటుపై ఎన్డీఏ కీలక భేటీ.. 40 శాతం వాటా కోరుతున్న జనసేన!
-
The Raja Saab : సంక్రాంతి విలన్.. రాజా సాబ్ పోస్ట్ మార్టం ఫెయిల్?
-
RC 17: సైలెంటుగా సుకుమార్ – చరణ్ సినిమా ఓపెనింగ్.!
-
Farmer Relief: కరువు వేళ రైతులకు దీపావళి కానుక.. ప్రతి రైతు ఖాతాలో రూ.5,000..!
-
Dussehra Special Recipes: కరకరలాడే జంతికల నుంచి స్వీట్ షాప్ స్టైల్ చిక్కీ వరకు పిండివంటలు ట్రై చేయండి..!
ట్రెండింగ్
-
Qais Ahmad: మాములు యాక్టింగ్ కాదయ్యా.. నీ పెర్ఫార్మన్స్‌కు ఆస్కార్ కూడా పనికిరాదేమో.! వీడియో వైరల్..
-
టాటా.. బైబై.. గయా.. WCL 2026 లీగ్ స్టేజీలోనే ఇండియా చాంపియన్స్ ఔట్..!
-
How To Grow Tej Patta In Pots: మార్కెట్ నుంచి తెచ్చే పని లేదు.. ఇంట్లోనే ఈజీగా బిర్యానీ ఆకు మొక్కను పెంచండి..
-
Sound Glow ఫీచర్‌తో Apple HomePod Mini 2 లాంచ్.. ఫీచర్లు మాత్రం మైండ్ బ్లోయింగ్ అంతే.!
-
Rohit Sharma MI Captain: మళ్లీ ముంబై ఇండియన్స్ కెప్టెన్‌గా రోహిత్ శర్మ.. హింట్ ఇచ్చేసిన ఫ్రాంచైజీ!