Site icon NTV Telugu

Vijay Devarakonda: విజయ్ దేవరకొండ కొత్త సినిమా.. టైటిల్, గ్లింబ్స్ రిలీజ్ డేట్ ఫిక్స్!

Vijay Deverakonda New Movie

Vijay Deverakonda New Movie

‘రౌడీ స్టార్’ విజయ్ దేవరకొండ అభిమానులకు అదిరిపోయే అప్‌డేట్ వచ్చేసింది. ప్రస్తుతం వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉన్న విజయ్.. ‘రాజా వారు రాణి గారు’ ఫేమ్ దర్శకుడు రవి కిరణ్ కోలాతో కలిసి ఒక భారీ పాన్ ఇండియా సినిమా చేయబోతున్నారు. ఈ ప్రాజెక్టుకు సంబంధించి తాజాగా విడుదలైన ‘డైరెక్టర్ నోట్’ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది.

దర్శకుడు రవికిరణ్ కోలా ఈ సినిమా గురించి చెబుతూ.. ఇది తన మనసుకు ఎంతో దగ్గరైన కథ అని వెల్లడించారు. తాను చిన్నప్పటి నుంచి చూసిన, గమనించిన ఒక వ్యక్తి జీవితం ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నట్లు తెలిపారు. ఆయన్ను ఎంత ద్వేషించారో.. అంతకంటే ఎక్కువగా అభిమానించారు అంటూ రవి కిరణ్ పంచుకున్న మాటలు సినిమాపై భారీ అంచనాలను పెంచేస్తున్నాయి. విజయ్ మార్క్ మేనరిజమ్స్‌కు, రవి కిరణ్ టేకింగ్ తోడైతే బాక్సాఫీస్ వద్ద రచ్చ ఖాయమనిపిస్తోంది.

Also Read: YS Jagan: ఖర్చు చేయకపోతే మెడికల్‌ కాలేజీలను అలానే వదిలేయండి.. అధికారంలోకి వచ్చాక పూర్తిచేస్తా!

అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఈ సినిమా టైటిల్ గ్లింప్స్‌ను డిసెంబర్ 22న రాత్రి 7:29 గంటలకు విడుదల చేయబోతున్నారు. ఈ సినిమాలో విజయ్ సరసన నేషనల్ అవార్డ్ విన్నర్ కీర్తి సురేశ్ హీరోయిన్‌గా నటిస్తోంది. వీరిద్దరి క్రేజీ కాంబినేషన్ వెండితెరపై ఎలా ఉండబోతుందో చూడాలని ఆడియన్స్ ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. గత కొంతకాలంగా విజయ్ దేవరకొండకు బాక్సాఫీస్ వద్ద సరైన సక్సెస్ లేదు. ఇటీవల వచ్చిన ‘ఫ్యామిలీ స్టార్’,’ది కింగ్డమ్’ సినిమాలు ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేకపోయాయి. దీంతో రౌడీ స్టార్ ఈసారి ఎలాగైనా గట్టి హిట్ కొట్టాలన్న కసితో ఉన్నారు. రూరల్ బ్యాక్‌డ్రాప్ కథలను అద్భుతంగా డీల్ చేసే రవికిరణ్ , విజయ్‌ను సరికొత్త మాస్ అవతారంలో చూపించబోతున్నట్లు తెలుస్తోంది.

Exit mobile version