రౌడీ హీరో విజయ్ దేవరకొండ అతి తక్కువ సమయంలోనే టాలీవుడ్ తో పాటు బాలీవుడ్ కు కూడా ఫేవరెట్ హీరోగా మారిపోయాడు. రోజురోజుకూ ఆయన అభిమానుల సంఖ్య పెరిగిపోతోంది. సోషల్ మీడియాలో అవసరమైన విషయాలపై మాత్రమే స్పందిస్తూ ఎప్పటికప్పుడు తన సినిమాల అప్డేట్స్ తో అభిమానులను పకరించే ఈ యంగ్ హీరో ఇప్పుడు సరికొత్త మైలు రాయిని దాటారు. సోషల్ మీడియాలో ఈ హీరోను భారీ సంఖ్యలో అభిమానులు ఫాలో అవుతున్నారు. ఇప్పుడు విజయ్ దేవరకొండ ఇన్‌స్టాగ్రామ్‌లో 14 మిలియన్ల మంది ఫాలోవర్లను దాటారు. విజయ్ దేవరకొండ ఫ్యాషన్ ఐకాన్ గా సోషల్ మీడియా ప్రపంచంలో తనకంటూ ఒక ముద్ర వేసుకున్నాడు. అర్జున్ రెడ్డికి దేశవ్యాప్తంగా భారీ సంఖ్యలో అభిమానులు ఉన్నారు. ఈ సందర్భంగా ఆయనను అభిమానులు సోషల్ మీడియాలో విష్ చేస్తున్నారు.
ప్రస్తుతం విజయ్ దేవరకొండ పాన్ ఇండియా చిత్రంతో బిజీగా ఉన్నాడు. విజయ్ నెక్స్ట్ స్పోర్ట్స్ బేస్డ్ థ్రిల్లర్ డ్రామా ‘లైగర్’ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ దర్శకత్వంలో తెరకెక్కుతోంది. ఇందులో అనన్య పాండే కథానాయికగా నటించింది. దీనిని పూరీ స్వయంగా ఛార్మీ కౌర్, కరణ్ జోహార్‌లతో కలిసి నిర్మిస్తున్నారు. ఈ సినిమా 2022 ఆగష్టు 25న విడుదల కానుంది. ఈ చిత్రం కోసం విజయ్ అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు.