రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ హీరోగా, దర్శకుడు రవి కిరణ్ కోలా తెరకెక్కిస్తున్న మాస్ యాక్షన్ డ్రామా ‘రౌడీ జనార్దన’ షూటింగ్ శరవేగంగా సాగుతోంది. గ్రామీణ నేపథ్యంలో సాగే ఈ సినిమా కథలో భావోద్వేగం, యాక్షన్, కుటుంబ బంధాలతో ఉంటాయని సమాచారం. తాజాగా ఈ సినిమాలో సీనియర్ హీరోయిన్ విజయశాంతి ఎంట్రీ గురించి వార్తలు ఫిల్మ్ సర్కిల్స్‌లో చక్కర్లు కొడుతున్నాయి. కథలో సెకండ్ హాఫ్‌లో వచ్చే కీలక ఎపిసోడ్ కోసం డైరెక్టర్ రవి కిరణ్ కోలా ఒక పవర్‌ఫుల్ పాత్రను డిజైన్ చేశారట. ఆ పాత్రను విజయశాంతి పోషిస్తే సినిమాకు మరింత బలమవుతుందని టీమ్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ వార్త నిజమైతే చాలా ఏళ్ల తర్వాత విజయశాంతిని స్క్రీన్‌పై చూడబోతున్న ఆనందంలో అభిమానులు ఉన్నారు.
Also Read : Pooja-Hegde : మరో సౌత్ సినిమా పట్టేసిన పూజా హెగ్డే – బ్యాక్ టు ఫామ్‌లో బుట్టబొమ్మ!
ఇక ఇప్పటికే కెన్యా షెడ్యూల్‌ను పూర్తి చేసిన టీమ్, త్వరలో కొత్త షెడ్యూల్‌ను స్టార్ట్ చేయబోతుంది. ఈ చిత్రాన్ని స్టార్ ప్రొడ్యూసర్ దిల్‌రాజు భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు. సినిమాలో సీనియర్ హీరో రాజశేఖర్ కూడా ఒక ప్రత్యేక పాత్రలో కనిపించనున్నారు. ఆయన పాత్ర, లుక్ ఇప్పటివరకు ప్రేక్షకులు చూసిన దానికంటే భిన్నంగా ఉంటుందని తెలుస్తోంది. విజయ్ దేవరకొండ సరసన ఈ సినిమాలో కీర్తి సురేశ్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ జంట కాంబినేషన్‌పై ప్రేక్షకుల్లో మంచి క్రేజ్ ఉంది. ప్రస్తుతం విజయ్ దేవరకొండ చేతిలో మరో భారీ ప్రాజెక్ట్ కూడా ఉంది. రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వంలో పీరియాడిక్ యాక్షన్ డ్రామా. ఈ రెండు సినిమాలతో విజయ్ మళ్లీ తన రౌడీ ఇమేజ్‌ను కొత్త స్థాయికి తీసుకెళ్లాలని లక్ష్యంగా పెట్టుకున్నాడు. సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. సీనియర్ స్టార్‌ల జతకలిసిన ఈ కాంబినేషన్ రౌడీ ఫ్యాన్స్‌కి డబుల్ ట్రీట్‌గా మారనుంది.