Vijay Binni Speech At Naa Saami Ranga Pre Release Event: నా సామిరంగా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో దర్శకుడు విజయ్ బిన్నీ మాట్లాడుతూ నాగార్జున పరిచయం చేసిన 25వ దర్శకుడిని తానే అవ్వడం అదృష్టంగా భావిస్తున్నానని అన్నారు. వేడుకకు హాజరైన మీడియా సహా సినీ ప్రముఖులందరికి థాంక్స్ చెప్పిన విజయ్ తన సినిమాకి పనిచేసిన టెక్నీషియన్లు అందరికీ సైతం థాంక్స్ చెప్పాడు. ఈ నా సామిరంగా మూవీ అనేది చాలా స్పెషల్ అని అంటూ ఒకే వేదిక మీదకు ముగ్గురు హీరోలను, ముగ్గురు హీరోయిన్లను తీసుకొచ్చిందని అన్నారు. ఇంతమంది ఒక సినిమాలో ఉండటం అంటే రేపు పండక్కి మీకు పండగ పండగే అని అన్నారు. మూవీని చాలా తక్కువ సమయంలో సక్సెస్ ఫుల్ గా పూర్తి చేసాం, ఈ తక్కువ టైంలో చేయడానికి ముఖ్య కారణం మా చిత్తూరి శ్రీనివాస్ గారు అన్నారు. ఒక కొత్త డైరెక్టర్ని మీరు ఎంకరేజ్ చేశారు నేను ఎప్పటికీ మిమ్మల్ని మర్చిపోలేను. సినిమాకి పని చేసిన టెక్నీషియన్స్ అందరికీ పేరుపేరునా థాంక్స్ చెప్పిన విజయ్ మీరందరూ ఎంత సపోర్ట్ చేశారు కాబట్టి చాలా తక్కువ సమయంలో సినిమా పూర్తి చేయగలిగి రిలీజ్ చేస్తున్నామని అన్నారు.
Chandrabose : కీరవాణికి చంద్రబోస్ పాదాభివందనం
ఆస్కార్ అవార్డు గ్రహీతలు కీరవాణి, చంద్రబోస్ గారి లాంటి వారితో పనిచేయడం ఎన్నో అనుభవాలను నేర్పిందని ఆయన అన్నారు. నేను మీలాగే అభిమానుల్లాగా వెనుక ఉండి అరుస్తూ ఉండేవాడిని, కొరియోగ్రాఫర్ గా మారిన తర్వాత మూడవ వరుసలోకి వచ్చా, మూడవ వరుస నుంచి మొదటి వరుసకు తీసుకొచ్చి కూర్చోబెట్టింది నాగార్జున గారు థాంక్యూ సో మచ్ అన్నారు. నెంబర్లు చూసుకుని ముందు సినిమా హిట్ ఇచ్చారా లేదా అని చూసుకుని డైరెక్టర్లగా సెలెక్ట్ చేసుకునే ఇండస్ట్రీలో అదేమీ లేకుండా రియల్ హీరో నాగార్జున గారు ఒక కొత్త వాడిని ఎంకరేజ్ చేశారని అన్నారు. నేను కొరియోగ్రాఫ్ చేసిన సాంగ్స్ చూసి నన్ను నమ్మి నాగార్జున గారు ఇంత పెద్ద సినిమా నా చేతిలో పెట్టారు అందుకు నేను జీవితాంతం రుణపడి ఉంటాను. అని అంటూ రెండు మోకాళ్ళ మీద కింద కూర్చున్న విజయ్ విని లైఫ్ లాంగ్ నా ఫేవరెట్ హీరో నాగార్జున గారే లైఫ్ లాగా నా గుండెల్లో ఉండిపోయే హీరో నాగార్జున అని అన్నారు.