‘బిచ్చగాడు’ ఫేమ్ విజయ్ ఆంటోనీ కొత్త సినిమా ‘హత్య’. ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్‌గా రాబోతున్న ఈ చిత్రంలో డిటెక్టివ్ గా కనిపించనున్నాడు విజయ్ ఆంటోనీ. రితికా సింగ్ ఓ కీలక పాత్ర పోషిస్తోంది. బాలాజీ కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీ మోషన్ పోస్టర్ ను విడుదల చేశారు. ఇది ఆసక్తికరంగా ఉండి సినిమా మీద ఉత్సుకతను పెంచుతోంది. లీలను ఎవరు హత్య చేశారనే కేసు పరిశోధన ఈ వీడియోలో చూపించారు. త్వరలో ఈ సినిమా థియేటర్లలోకి రానుంది. ఇతర కీలక పాత్రల్లో మురళీ శర్మ, జాన్ విజయ్, రాదికా శరత్‌కుమార్, సిద్ధార్థ శంకర్, అర్జున్ చిదంబరం, కిషోర్ కుమార్, సంకిత్ బోరా కనిపించనున్నారు. శివకుమార్ విజయన్ సినిమాటోగ్రఫీ, ఆర్‌కె సెల్వ ఎడిటింగ్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఈ సినిమాకు గిరీష్ గోపాలకృష్ణన్ సంగీతం సమకూరుస్తున్నారు.
Read Also: Gargi Movie Review: గార్గి (తమిళ డబ్బింగ్)
