‘బాహుబలి’ చిత్రంలోని మనోహరి పాటను అంత త్వరగా ఎవరు మర్చిపోలేరు.. అందులో తన అందచందాలతో కుర్రాళ్ల మనసులను కట్టిపడేసిన నోరా ఫతేహి గురించి యెంత చెప్పినా తక్కువే అవుతోంది. బాలీవుడ్ హాట్ బ్యూటీ ఈ సాంగ్ తో ప్రపంచ వ్యాప్తంగా పాపులర్ అయినా సంగతి తెలిసిందే . ఇక తాజాగా అమ్మడు ఒక మ్యూజిక్ ఆల్బమ్ లో నటిస్తోంది.
బాలీవుడ్ సింగర్ గురు రందావాతో కలిసి ‘డ్యాన్స్ మేరీ రాణి’ వీడియో సాంగ్ లో కనిపించనుంది. ఇప్పటికే వీరిద్దరి కాంబోలో వచ్చిన ‘నాచ్ మేరీ రాణీ’ సాంగ్ సూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. ఇకపోతే ఈ సాంగ్ కోసం నోరా గట్టిగా కష్టపడినట్లు తెలుస్తోంది. ఈ సాంగ్ లో నోరా సాగర కన్యలా కనిపించనుంది. దీనికోసం చిత్ర బృందం ఓ సాగర తీరానా షూటింగ్ ప్లాన్ చేశారు. అక్కడ సాగర కన్య గెటప్ లో నడవడం కుదరదు కాబట్టి అమ్మడిని ఇదుగో ఇలా స్ట్రెచర్‌పై నీళ్లలోకి తీసుకువెళుతున్నారు.
ప్రస్తుతం మేకింగ్ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. నటీనటులు అందంగా తెరపై కనిపించడానికి ఎంతలా కష్టపడతారు అనేది ఈ వీడియో ద్వారా అర్థమవుతుందని అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. ఇలాంటి లొకేషన్స్ లో జాగ్రత్తగా ఉండాలని నోరాకు అభిమానులు జాగ్రత్తలు తెలుపుతున్నారు.