విక్టరీనే ఇంటి పేరుగా మార్చుకునే రేంజులో హిట్స్ కొట్టిన వెంకటేష్ ఎప్పుడూ చాలా కూల్ గా, క్యాజువల్ గా, అందరితో ఫ్రెండ్లీగా ఉంటాడు. తన పని తాను చేసుకుంటూ, హ్యాపీగా సినిమాలు చేసుకుంటూ వెళ్లిపోయే వెంకటేష్, ఒటీటీ దిగ్గజం నెట్ ఫ్లిక్స్ పైన సీరియస్ అయ్యాడు. వెబ్ సీరీస్ కి ఎవరి పేరునో ఎలా పెడతారు అంటూ ఫైర్ అయ్యాడు. వెంకీ మామ గన్ను పట్టుకోని నెట్ ఫ్లిక్స్ కి వార్నింగ్ ఇస్తున్న వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తన ట్విట్టర్ లో వెంకీ మామ పోస్ట్ చేసిన ఈ వీడియో ఇంతకీ దేని గురించి అనే కదా మీ డౌట్… వెంకటేష్, రానా కలిసి నెట్ ఫ్లిక్స్ కోసం ఒక వెబ్ సీరీస్ చేశారు. ‘రానా నాయుడు’ అనే పేరుతో బయటకి రానున్న ఈ సీరీస్ షూటింగ్ ఎప్పుడో కంప్లీట్ చేసుకుంది. ఈ సీరీస్ టీజర్ కూడా బయటకి వచ్చి దగ్గుబాటి అభిమానులని ఖుషి చేసింది. వెంకీ మామ, రానాల మధ్య సీన్స్ టీజర్ లో ఇంప్రెస్ చేశాయి.
న్యూ జనరేషన్ కి తగ్గట్లు అప్డేట్ అయిన వెంకటేష్, వెబ్ సిరీస్ చెయ్యడం బాగానే ఉంది కానీ ఇది ఎప్పుడు రిలీజ్ అవుతుంది అనే విషయంలో మాత్రం ఎవరికీ ఎలాంటి క్లారిటీ లేదు. దగ్గుబాటి అభిమానులు ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్న ఈ సీరీస్ ప్రమోషన్స్ కోసమే వెంకీ మామ వార్నింగ్ వీడియోని రిలీజ్ చేశాడు. ఇందులో “తప్పు చెయ్యకూడదు నెట్ ఫ్లిక్స్… హీరో నేను, షో నాది, అందరికన్నా పెద్ద స్టార్ ని నేను, స్క్రీన్ ప్రెజెన్స్ కూడా నాదే బాగుంటుంది, ఫాన్స్ కూడా నా వాళ్లే కాబట్టి షో పేరు కూడా నాదే అవ్వాలి… నాగా నాయుడు” అంటూ వెంకీ మామ సెల్ఫీ వీడియో వదిలాడు. మరి వెంకీ మామ వార్నింగ్ కి భయపడి నెట్ ఫ్లిక్స్ షో పేరుని మారుస్తుందా? లేక రానాని రంగంలోకి దించుతుందా అనేది చూడాలి.
— Suresh Productions (@SureshProdns) February 13, 2023