Nani 30: వెంకీ మామను ఢీ కొట్టబోతున్న నేచురల్ స్టార్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Venkatesh: నేచురల్ స్టార్ నానికి చాలా కాలం తర్వాత ఓ గ్రాండ్ సక్సెస్ ‘దసరా’ రూపంలో దక్కింది. పాన్ ఇండియా మూవీగా విడుదలైన ‘దసరా’ ఉత్తరాదిన వండర్స్ సృష్టించకపోయినా… తెలుగులో మాత్రం భారీ ఓపెనింగ్స్ ను తెచ్చిపెట్టింది. అంతేకాదు… నటుడిగా నానిని మరో మెట్టు పైకి ఎక్కించింది. ఈ మూవీతో నాని వందకోట్ల క్లబ్ లో చేరిపోయాడు. ఇదిలా ఉంటే… నాని 30వ చిత్రం ఈ యేడాది జనవరి 31న గ్రాండ్ గా మొదలైంది. శౌర్యువ్ దర్శకత్వంలో మోహన్ చెరుకూరి, డా. విజయేందర్ రెడ్డి తీగల, మూర్తి కె. ఎస్. దీన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ‘సీతారామం’ ఫేమ్ మృణాల్ ఠాకూర్ ఇందులో హీరోయిన్. విశేషం ఏమంటే… శనివారం ఈ సినిమా విడుదల తేదీని నాని స్వయంగా ట్వీట్ చేశాడు. ఈ సందర్భంగా విడుదలైన పోస్టర్ చూస్తుంటే… ఇదేదో తండ్రీ కూతుళ్ళ సెంటిమెంట్ మూవీ అనిపిస్తోంది. నాని గతంలో ‘జెర్సీ’లో ఇలానే తండ్రీ కొడుకుల అనుబంధాన్ని తెలిపే పాత్రను పోషించి మెప్పించాడు.
ఇవన్నీ పక్కన పెడితే… ఈ సినిమా విడుదల తేదీనే ఇప్పుడు ఫిల్మ్ నగర్ లో చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే… డిసెంబర్ 22న విక్టరీ వెంకటేశ్ నటిస్తున్న తొలి పాన్ ఇండియా మూవీ ‘సైంథవ్’ విడుదల కాబోతోంది. క్రిస్మస్ కానుకగా దీన్ని ఆ రోజున విడుదల చేస్తున్నట్టు మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు. సరిగ్గా దానికి ఒక్క రోజు ముందు నాని 30వ చిత్రం వస్తున్నట్టు ఇప్పుడు ఈ నిర్మాతలు తెలిపారు. నిజానికి స్టార్ హీరోల సినిమాలు ఒకదాని వెనుక మరొకటి రావడం పెద్ద వింతేమీ కాదు. కానీ ఇక్కడ గమనించాల్సింది ఏమిటంటే… ‘సైంథవ్’ మూవీని డైరెక్ట్ చేస్తోంది నాని నిర్మించిన ‘హిట్, హిట్ -2’ చిత్రాలను తెరకెక్కించిన శైలేష్ కొలను. అంటే తన దర్శకుడి మూడో సినిమా మీదకు పోటీగా నాని 30వ చిత్రం రాబోతోందన్న మాట. పోనీ వీరిద్దరి మధ్య ఏమైనా పొరపొచ్చాలు వచ్చాయా అనుకుంటే… అదీ లేదు. ఎందుకంటే ‘హిట్ 3’ మూవీని శైలేష్ కొలను దర్శకత్వంలోనే నాని తనే హీరోగా నిర్మించబోతున్నాడు. ‘హిట్ 2’ విడుదల అనంతరం అనేక సందర్భాలలో నాని స్వయంగా ఈ విషయాన్ని చెప్పాడు. కానీ ఇప్పుడు నాని సినిమా రిలీజ్ డేట్ కారణంగా… లేనిపోని అనుమానాలకు తావు ఇచ్చినట్టు అవుతోంది. అన్నట్టు నాని ‘జెర్సీ’లో నటించిన శ్రద్ధ శ్రీనాథే ఇప్పుడు ‘సైంథవ్’లో హీరోయిన్. అయినా డిసెంబర్ చివరి వారం అంటే… ఇంకా చాలా సమయం ఉంది కాబట్టి… ఈ సినిమా విడుదల తేదీ కాస్తంత అటూ ఇటూ అవుతుందేమో చూడాలి.
Also Read
- మనం రోడ్డుపై చూసి వదిలేసే 'బిచ్చగాళ్ల' వెనుక ఇంత పెద్ద కథ ఉందా..?
- SlumDog Movie Teaser: 'మా బతుకులతో ఆడుకుంటే వదలం'.. గూస్బంప్స్ తెప్పిస్తున్న పూరీ 'స్లమ్‌డాగ్' టీజర్!
- Ram Charan: ఈ సినిమాలో ఆయన నటన చూసి నాకు కంట్లో నీళ్లు వచ్చాయి: రామ్‌చరణ్
- Ravi Shankar : ఈ సినిమాను చరణ్ తన ఒంటి కాలుతో నెక్స్ట్ లెవెల్‌కి తీసుకెళ్లారు: మైత్రీ రవిశంకర్
తాజావార్తలు
-
Train Ticket Booking: ప్రయాణికులకు శుభవార్త.. మరింత ఈజీగా బుకింగ్‌లు.. ఎప్పటి నుంచంటే..!
-
Israel-Iran: ఇరాన్ సీజ్‌ఫైర్‌పై ఇజ్రాయెల్ మౌనం.. సర్వత్రా ఉత్కంఠ!
-
Vaibhav: 15 ఏళ్ల వండర్ కిడ్ ‘వైభవ్ సూర్యవంశీ’పైనే అందరి కళ్ళు.. లంక పిచ్‌లపై భారత్ ‘ఎ’ ట్రై-సిరీస్ పోరు..
-
Mahua Moitra: అమిత్ షా పిలవగానే వెళ్తావా సిగ్గు లేదా.? యూసుఫ్ పఠాన్‌పై మహువా మోయిత్రా ఫైర్..
-
Kitchen Hacks: వంటగదిలో ఈ చిన్న ట్రిక్స్ తెలిస్తే.. మీ పని సగం తగ్గుతుంది!
ట్రెండింగ్
-
Protein Powder : ప్రోటీన్ పౌడర్ తీసుకోవడం సురక్షితమేనా? ఈ విషయం తెలుసుకోకుండా వాడకండి..!
-
Manav Suthar Record: అరంగేట్ర స్పిన్నర్ మానవ్ సుతార్ అరుదైన రికార్డు.. ఈ శతాబ్దంలోనే ‘ఒకే ఒక్కడు’!
-
Harmanpreet Kaur: ‘నేను రిటైర్ అవ్వాలనుకుంటున్నారా?’.. రిపోర్టర్ కు ధోనీ స్టైల్లో మహిళా కెప్టెన్ కౌంటర్.!
-
Birth Rate: భారత్‌లో పడిపోతున్న జననాల రేటు.. విద్యావంతులు తక్కువ మంది పిల్లలను కనడమే కారణమా.?
-
Sugar Cravings Control : తీపి తినాలనే కోరికా..? ఈ చిట్కాలతో మీ స్వీట్ క్రేవింగ్స్‌కు చెక్ పెట్టండి.!