Site icon NTV Telugu

Jani Master: జానీ మాస్టర్ క్యారవాన్ లో బలవంతం చేశాడు.. సంచలన విషయాలు వెలుగులోకి

Jani Master Missing

Jani Master Missing

Jani Master: టాలీవుడ్ టాప్ కొరియోగ్రఫర్ జానీ మాస్టర్ వ్యవహారం ఈరోజు ఉదయం నుంచి హాట్ టాపిక్ అవుతోంది. ఆయన తనను రేప్ చేశాడని, చెన్నై – ముంబై వెళ్ళినపుడు హోటల్స్ లో అలాగే నార్శింగిలో తన నివాసంలో కూడా లైంగికంగా వేధించాడని ఆమె రాయదుర్గం పోలీస్ స్టేషన్లో నిన్న ఫిర్యాదు చేసింది. ఇక ఆమె నార్సింగి పరిధిలో నివాసం ఉంటున్న క్రమంలో ఆ ఫిర్యాదును జీరో ఎఫ్ ఐ ఆర్ ద్వారా అదే పోలీస్ స్టేషన్ కి బదిలీ చేశారు. కేసు నమోదైన క్రమంలో జానీ మాస్టర్ సంప్రదించేందుకు పోలీసులు ప్రయత్నించారు. అయితే ఆయన సెల్ ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తున్నట్లు తెలుస్తోంది. జానీ మాస్టర్ దగ్గర పనిచేసే ఇద్దరు అసిస్టెంట్ల ఫోన్లు కూడా స్విచ్ ఆఫ్ వస్తుండడంతో పోలీసులు బాధితురాలి స్టేట్మెంట్ రికార్డు చేశారు.

Also Read: Jani Master: జానీ మాస్టర్ వ్యవహారంపై ఫిలిం ఛాంబర్ కీలక ప్రకటన

ఈ క్రమంలో ఆమె స్టేట్‌మెంట్ సంచలనం రేపుతోంది. ఆమె నుంచి స్టేట్‌మెంట్ తీసుకున్నారు పోలీసులు.. బాధితురాలి ఇంట్లోనే 3 గంటల పాటు విచారించారు పోలీసులు. బాధితురాలిని భరోసా కేంద్రానికి తీసుకెళ్లిన పోలీసులు, వైద్య పరీక్షలు కూడా చేయించారు. షూటింగ్ టైమ్‌లో క్యారవాన్‌లో జానీ మాస్టర్ తనను బలవంతం చేశాడు అని కోరిక తీర్చమని నన్ను ఎంతో వేధించాడు అని ఆమె పేర్కొంది. తన కోరిక తీర్చ లేదంటే ఆఫర్లు లేకుండా చేస్తానని కూడా బెదిరించాడు అని ఆమె పేర్కొన్నట్టు సమాచారం. పెళ్లి చేసుకోవాలని కూడా జానీ మాస్టర్ నాపై ఒత్తిడి చేశాడు అంటూ బాధితురాలు స్టేట్మెంట్ ఇచ్చింది అని చెబుతున్నారు.

Exit mobile version