Site icon NTV Telugu

VI Anand : హనుమాన్ నిర్మాతతో వి.ఐ.ఆనంద్ మల్టీ స్టారర్

Vi Anand

Vi Anand

VI Anand : యూనిక్ సినిమాలు చేస్తాడనే పేరున్న దర్శకుడు వి.ఐ. ఆనంద్ చివరిగా ఊరి పేరు భైరవకోన సినిమా చేశాడు. ఆ సినిమా కాస్ట్ ఫెయిల్యూర్‌గా నిలిచింది. ఈ క్రమంలో సీక్వెల్ ఎప్పుడు వస్తుందనే విషయంపై స్పష్టత లేదు. అయితే, ఇప్పుడు ఆయన మరో సోషియో-ఫాంటసీ సినిమా చేసేందుకు సిద్ధమవుతున్నాడు. ఈ సినిమా కేవలం తెలుగు ఆడియన్స్ కోసం కాకుండా, పాన్-ఇండియా స్థాయిలో విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ప్రస్తుతం సినిమాకు సంబంధించిన ప్రీ-ప్రొడక్షన్ పనులు సైలెంటుగా జరుగుతున్నాయి. నిరంజన్ రెడ్డి తన ప్రైమ్ షో ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై ఈ సినిమాను నిర్మించేందుకు సిద్ధమవుతున్నాడు.

Read Also : Bhairavam : భైరవం ట్రైలర్ డేట్ ఫిక్స్.. ఎప్పుడంటే..?

హనుమాన్ సినిమాతో బ్లాక్‌బస్టర్ సాధించిన నిరంజన్ రెడ్డి, ఆ తర్వాత డార్లింగ్ సినిమా చేశాడు, కానీ అది విజయం సాధించలేదు. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో లైగర్ సినిమాను డిస్ట్రిబ్యూట్ చేశాడు, అది కూడా డిజాస్టర్‌గా నిలిచింది. ప్రస్తుతం ఆయన సాయి ధరమ్ తేజ్ హీరోగా సంబరాల ఏటిగట్టు అనే సినిమా చేస్తున్నాడు. దానితో పాటు ఈ కొత్త సినిమాపై కూడా దృష్టి పెడుతున్నాడు. ఈ సినిమాలో ఇద్దరు స్టార్ హీరోలు నటించే అవకాశం ఉందని అంటున్నారు. ప్రస్తుతం వారిని ఒప్పించే పనిలో ఉన్నారు. వారు ఒప్పుకున్న తర్వాత అధికారిక ప్రకటనతో సినిమాను పట్టాలెక్కించే అవకాశం ఉంది. వి.ఐ. ఆనంద్‌తో పాటు నిరంజన్ రెడ్డి కూడా తన పరిచయాలను ఉపయోగించి స్టార్ హీరోలను రంగంలోకి దించే ప్రయత్నం చేస్తున్నారు. ఇది ఎంతవరకు విజయవంతమవుతుందో చూడాలి.

Read Also : Vishwambhara : విశ్వంభర “టెన్షన్లో” ఫాన్స్!

Exit mobile version