వెట్రిమారన్… ఇండియాలోనే మోస్ట్ రా అండ్ రస్టిక్ సినిమాలు తెయ్యగల ఏకైక డైరెక్టర్. కథని అందరికీ అర్ధం అయ్యే విధంగా హై ఇంటెన్సిటీతో చెప్పడంలో వెట్రిమారన్ ని మ్యాచ్ చెయ్యగల డైరెక్టర్ ఇండియాలోనే లేడు అని చెప్పడం అతిశయోక్తి కాదేమో. గత పదహారు సంవత్సరాల్లో కేవలం అయిదు సినిమాలని మాత్రమే డైరెక్ట్ చేసి, ఇందులో మూడు సినిమాలకి బెస్ట్ డైరెక్టర్ గా నేషనల్ అవార్డ్ అందుకున్నాడు అంటే వెట్రిమారన్ ట్రాక్ రికార్డ్ ఎలాంటిదో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. లో బడ్జట్ లో ‘కాకా ముట్టై’ అనే సినిమా తీసి దాన్ని ఇంటర్నేషనల్ లెవల్ కి తీసుకోని వెళ్లిన వెట్రిమారన్ పేరు ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది. ఇందుకు రెండు కారణాలు ఉన్నాయి. వెట్రిమారన్, ఎన్టీఆర్ కాంబినేషన్ లో ఒక సినిమా ఓకే అయ్యింది. వెట్రిమారన్ చెప్పిన మూడు కథల్లో ఒకటి ఎన్టీఆర్ కి చాలా బాగా నచ్చి, దాన్ని ఫైనల్ చేసాడని సోషల్ మీడియా కోడై కూస్తుంది.
Read Also: NTR: ఎందుకన్నా అంత కోపం.. అడిగింది అప్డేటేగా
రెండు భాగాలుగా వెట్రిమారన్, ఎన్టీఆర్ సినిమా రానుంది అనే వార్త సోషల్ మీడియాలో స్ప్రెడ్ అవ్వడంతో వెట్రిమారన్ పేరు ట్విట్టర్ లో హాట్ టాపిక్ అయ్యింది. ఇక సెకండ్ రీజన్, వెట్రిమారన్ ‘విడుదలై’ అని ఒక సినిమా చేస్తున్నాడు. సూరి, విజయ్ సేతుపతి లాంటి టాలెంటెడ్ యాక్టర్స్ కలిసి నటిస్తున్న ఈ మూవీ నుంచి ఒక సాంగ్ ని రిలీజ్ చెయ్యనున్నారు. ఇళయరాజా మ్యూజిక్ కంపోజ్ చేసిన “ఉన్నోడ నడంద” అనే సాంగ్ ని ధనుష్ పాడడం జరిగింది. దీనికి సంబంధించిన ప్రోమో బయటకి రాగానే ధనుష్ ఫాన్స్ సోషల్ మీడియాలో యాక్టివ్ అయ్యారు. పైగా ధనుష్-వెట్రిమారన్ లు ఈ పాట కోసం మరోసారి కలవడంతో సోషల్ మీడియా షేక్ అయ్యింది. వెట్రిమారన్-ధనుష్ ల కెరీర్ లని వేరు చేసి చూడడం కష్టం అనే రేంజులో ఈ ఇద్దరూ కలిసి వర్క్ చేశారు. తాజాగా ఎన్టీఆర్-వెట్రిమారన్ ప్రాజెక్ట్ పార్ట్ 2లో కూడా ధనుష్ ఉంటాడు అనే మాట వినిపిస్తోంది. ఇదే జరిగితే ఇండియన్ బాక్సాఫీస్ లెక్కలు మార్చడానికి మరో సినిమా రెడీ అయినట్లే. సో మొత్తానికి ఈ రెండు కారణాల వలన వెట్రిమారన్ పేరు ట్విట్టర్ లో ట్రెండ్ అవుతుంది.