NTV Telugu Site icon

Jr NTR: ప్లేటు తిప్పేసిన ఆ డైరెక్టర్.. తారక్ ఫ్యాన్స్ ఆశలు గల్లంతు

Vetrimaaran Jr Ntr

Vetrimaaran Jr Ntr

Vetrimaaran Gives Shock To Jr NTR Fans: కొన్ని రోజుల క్రితం జూ. ఎన్టీఆర్‌పై ఓ రూమర్ తెగ చక్కర్లు కొట్టింది. కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ వెట్రిమారన్‌తో తారక్ జత కట్టబోతున్నాడన్నదే ఆ రూమర్ సారాంశం. ఇదొక మల్టీస్టారర్ సినిమా అని, ఇందులో ధనుష్ కూడా మరో కథానాయకుడి పాత్రలో నటించబోతున్నాడని ప్రచారం జరిగింది. ఓ వారం రోజుల పాటు ఈ ప్రచారం జరగడం, దీన్ని ఎవ్వరూ ఖండించకపోవడంతో.. తారక్ ఫ్యాన్స్ నిజమేనని అనుకున్నారు. ఇదో క్రేజీ కాంబినేషన్ అని, తప్పకుండా ఈ ప్రాజెక్ట్ సరికొత్త సంచలనాలకు తెరతీస్తుందని భావించారు. ఆల్రెడీ విలక్షన నటుడిగా తానేంటో నిరూపించుకున్న తారక్‌కి వెట్రిమారన్ లాంటి దర్శకుడు తోడైతే, ఇక విశ్వరూపం చూపించడం ఖాయమని ఫిక్స్ అయ్యారు. కానీ.. ఇంతలోనే వెట్రిమారన్ ఓ బాంబ్ పేల్చాడు. ఈ ప్రాజెక్టే లేదని పరోక్షంగా స్పష్టం చేశాడు.

Vidya Balan: ఆ డైరెక్టర్‌తో రూమ్‌లోకి వెళ్లా.. డోర్ లాక్ చేయకుండానే..

తన లేటెస్ట్ సినిమా ‘విదుతలై’ ఆడియో ఈవెంట్‌లో వెట్రిమారన్ మాట్లాడుతూ.. ప్రస్తుతం తన దృష్టంతా ఈ విదుతలైని పూర్తి చేయడంలోనే ఉందన్నాడు. ఇది రెండు భాగాల్లో రూపొందుతున్న సినిమా. ఇప్పుడు పార్ట్ 1 విడుదల చేస్తున్నారు. దీని తర్వాత పార్ట్ 2 చిత్రీకరణను ప్రారంభిస్తారు. ఈ ప్రాజెక్ట్ తర్వాత తాను సూర్యతో కలిసి వాడివాసల్ సినిమా చేయబోతున్నానని స్పష్టం చేశాడు. అంతేకాదు.. సూర్యతో ప్రాజెక్ట్ ముగిశాక, ధనుష్‌తో వడా చెన్నై 2 సినిమాని సెట్స్ మీదకు తీసుకెళ్లనున్నట్టు క్లారిటీ ఇచ్చాడు. ఇలా తన ప్రసంగంలో ఈ మూడు ప్రాజెక్టుల గురించే మాట్లాడాడే తప్ప.. తెలుగు హీరోతో జతకడుతున్నట్టు ఒక్క హింట్ కూడా ఇవ్వలేదు. దీంతో.. ఎన్టీఆర్, వెట్రిమారన్ కాంబో లేనట్టేనని అర్థమవుతోంది. మరి.. భవిష్యత్తులోనైనా వీరి కలయికలో ఓ ప్రాజెక్ట్ ఉంటుందో? లేదో? చూడాలి.

Menstrual Blood : రక్తం ఖరీదు రూ.50వేలు.. కోడలిది తీసి మంత్రగాడికి అమ్మిన అత్త

Show comments