Yellamma : బలగం సినిమా డైరెక్టర్ వేణు యెల్దండి రెండేళ్లుగా ఈ ఎల్లమ్మ కథ పట్టుకుని వెయిట్ చేస్తున్నాడు. అసలు సినిమా అనౌన్స్ చేయకముందే ఈ కథ మీద భారీ అంచనాలు పెరిగిపోయాయి. ఈ కథ దిల్ రాజుకు బాగా నచ్చింది. అందుకే సరైన హీరో కోసం వేణును తన దగ్గర లాక్ చేసి పెట్టుకున్నాడు. మొన్నటి దాకా నితిన్ హీరో అన్నారు. కానీ తమ్ముడు మూవీ ప్లాప్ కావడంతో నితిన్ ఈ సినిమా నుంచి తప్పుకున్నాడు. దాంతో శర్వానంద్ పేరు బలంగా వినిపించింది. కానీ అతను కూడా ఫైనల్ కాలేదని తెలుస్తోంది. చూస్తుంటే అసలు తెలుగులో ఈ కథకు కరెక్ట్ హీరో ఎవరూ దొరకట్లేదని ప్రచారం ఉంది. హీరో నానిపై బోలెడన్ని ఆశలు పెట్టుకున్నాడు వేణు. కానీ నాని ఇంకో రెండేళ్ల దాకా ఫుల్ బిజీ.
Read Also : Little Hearts : ఆ విషయంలో మౌళిని చూసి మిగతా హీరోలు నేర్చుకోవాల్సిందే..
కాబట్టి నానితో కాకుండా వేరే హీరోతో చేయాలని ప్లాన్ చేసుకుంటున్నాడు వేణు. తెలుగులో ఎవరూ ఈ కథలో నటించేందుకు ఒప్పుకోవట్లేదంట. ఎందుకంటే కథ చాలా బలంగా ఉంది. హిట్ అయితే ఎక్కడికో వెళ్లిపోతుందని భావిస్తున్నారు. కానీ ఏ మాత్రం తేడా కొట్టినా ఆ ఎఫెక్ట్ మామూలుగా ఉండదంట. అందుకే కథ, ఇందులో హీరో పాత్ర విషయంలో చాలా చర్చలు జరుగుతున్నాయి. తెలుగులో ఇలాంటి కథల్లో నటించిన హీరోలు పెద్దగా లేరు. అందుకే ఇప్పుడున్న వారు వెనకడుగు వేస్తున్నారంట. దీంతో తమిళ హీరోల వైపు వేణు చూస్తున్నాడని తెలుస్తోంది. ఈ సినిమాలో కచ్చితంగా ఓ పెద్ద హీరోనే కావాలని వేణు చూస్తున్నాడు. అందుకే తెలుగులో చిన్న హీరోలను సంప్రదించకుండా నేరుగా తమిళ్ స్టార్లకు గురి పెడుతున్నాడు. కార్తీ పేరు ఈ మధ్య వినిపిస్తోంది. మరి ఎవరు ఫైనల్ అవుతారో చూడాలి.
Read Also : Rajni – Kamal : రజనీకాంత్ – కమల్ హాసన్ సినిమా నుండి లోకేష్ కనకరాజ్ అవుట్..
