Kalyan Ram: సంక్రాంతి 2027కు సిద్ధమవుతున్న అనిల్ రావిపూడి.. కళ్యాణ్ రామ్ ఫస్ట్ లుక్‌తో భారీ అప్డేట్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kalyan Ram: సంక్రాంతి అంటే తెలుగు సినీ ప్రేక్షకులకు పండుగ మాత్రమే కాదు, భారీ సినిమాల సందడి కూడా. ప్రతి ఏడాది స్టార్ హీరోల సినిమాలు బాక్సాఫీస్ వద్ద పోటీ పడుతూ ప్రేక్షకులకు కావాల్సినంత వినోదాన్ని పంచుతుంటాయి. ఇప్పుడు 2027 సంక్రాంతి కోసం కూడా మరో క్రేజీ కాంబినేషన్ సిద్ధమవుతోంది. వరుస విజయాలతో ఫుల్ జోష్‌లో ఉన్న దర్శకుడు అనిల్ రావిపూడి తెరకెక్కిస్తున్న తాజా చిత్రంలో విక్టరీ వెంకటేష్, నందమూరి కళ్యాణ్ రామ్ కలిసి నటిస్తుండటం ఇప్పటికే భారీ అంచనాలను పెంచింది. తాజాగా కళ్యాణ్ రామ్ పుట్టినరోజు సందర్భంగా విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్ ఈ సినిమాపై మరింత బజ్ క్రియేట్ చేస్తోంది.
ప్రస్తుతం #VenkyAnil5, #NKR22 వర్కింగ్ టైటిల్స్‌తో రూపొందుతున్న ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత సాహు గారపాటి నిర్మిస్తున్నారు. ఇప్పటికే హైదరాబాద్‌లో తొలి షెడ్యూల్ చిత్రీకరణ కొనసాగుతోంది. అనిల్ రావిపూడి స్టైల్‌కు తగ్గట్టుగా కామెడీ, ఫ్యామిలీ ఎమోషన్స్, పండుగ వాతావరణం కలగలిపిన కమర్షియల్ ఎంటర్టైనర్గా ఈ సినిమా రూపొందుతున్నట్లు తెలుస్తోంది. ఈవాల కళ్యాణ్ రామ్ పుట్టినరోజు సందర్భంగా విడుదల చేసిన పోస్టర్లో ఆయన పూర్తిగా పండుగ మూడ్‌లో కనిపించారు. పంచా, కుర్తా ధరించి, మెడలో పూలదండ, కళ్లకు స్టైలిష్ సన్‌గ్లాసెస్‌తో కళ్యాణ్ రామ్ డ్యాన్స్ చేస్తూ కనిపించడం అభిమానులను ఆకట్టుకుంటోంది. ఆ ఒక్క ఎనర్జీ పోస్టర్‌తోనే సినిమాలోని పండుగ వాతావరణాన్ని చిత్రబృందం ప్రేక్షకులకు పరిచయం చేసింది.
Also Read
- Varanasi: 50కి పైగా భాషల్లో ‘వారణాసి’.. డబ్బింగ్ కోసం 1600 మందికి పైగా ఆర్టిస్టులు!
- Bobby Deol: అప్పటివరకు సరైన హిట్ లేదు.. ‘యానిమల్’తో ఓవర్‌నైట్ సెన్సేషన్.. ఇప్పుడు ఆ ఇమేజ్‌పై పోరాటం!
- Drishyam 4: జార్జ్‌కుట్టి కథకు మరో ట్విస్ట్.. ‘దృశ్యం 4’ను అధికారికంగా ప్రకటించిన మేకర్స్!
- Niu Lai Box Office: స్టార్లు లేరు.. భారీ బడ్జెట్ లేదు.. అయినా రూ.కోట్ల వసూళ్లు! ఈ చిన్న సినిమా రచ్చ మామూలుగా లేదుగా..
మరో ఆసక్తికర విషయం ఏమిటంటే, ఇదే సందర్భంగా కళ్యాణ్ రామ్ తన అధికారిక ఇన్స్టాగ్రామ్ ఖాతాను కూడా ప్రారంభించారు. @nandamurikalyanram పేరుతో ప్రారంభించిన అకౌంట్లో తొలి పోస్టుగానే ఈ సినిమా ఫస్ట్ లుక్‌ను షేర్ చేశారు. “అనిల్ రావిపూడి జోన్లో ఉండటం ఎప్పుడూ ఆనందంగానే ఉంటుంది. సంక్రాంతి 2027కి ఒక అద్భుతానికి సిద్ధంగా ఉండండి” అంటూ చేసిన పోస్టు అభిమానుల్లో మరింత ఉత్సాహాన్ని నింపింది. ఈ చిత్రంలో విక్టరీ వెంకటేష్ మరో కీలక పాత్రలో కనిపించనుండగా, కీర్తి సురేష్, కృతి శెట్టి కథానాయికలుగా నటిస్తున్నారు. ఇద్దరు హీరోలకు సమాన ప్రాధాన్యత ఉండేలా కథను అనిల్ రావిపూడి తీర్చిదిద్దుతున్నట్లు సమాచారం.
ఇక ఈ సినిమాకు సంగీత దర్శకుడు జి.వి. ప్రకాష్ కుమార్ స్వరాలు అందిస్తుండగా, ఛాయాగ్రాహకుడిగా సమీర్ రెడ్డి, ఎడిటర్‌గా తమ్మిరాజు, ప్రొడక్షన్ డిజైనర్‌గా ఎ.ఎస్. ప్రకాష్ పనిచేస్తున్నారు. అనిల్ రావిపూడి గత చిత్రాల విజయాలను దృష్టిలో ఉంచుకుంటే, ఈ సినిమా కూడా పూర్తి స్థాయి ఫ్యామిలీ ఎంటర్టైనర్గా నిలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి. వెంకటేష్, కళ్యాణ్ రామ్‌ల కాంబినేషన్‌కు అనిల్ రావిపూడి వినోదాత్మక టచ్ తోడవడంతో, సంక్రాంతి 2027 బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రం రకార్డుల వరద సృష్టించడం ఖాయంగా కనిపిస్తోంది.
It’s always a delight to be in @AnilRavipudi‘s zone… This Sankranthi 2027, get ready for a blast! 🔥#VenkyAnil5 #NKRAR2 pic.twitter.com/0wtbsjnOJD
— Kalyanram Nandamuri (@NANDAMURIKALYAN) July 5, 2026
- Tags
- cinema
- Kalyan Ram
తాజావార్తలు
-
AK-203: AK-203 ‘షేర్’.. రష్యన్ టెక్నాలజీ, మేడ్ ఇన్ ఇండియా రైఫిల్
-
NMMS Scholarship : విద్యార్థులకు రూ.48 వేల స్కాలర్షిప్.. రేపే లాస్ట్ ఛాన్స్.!
-
Varanasi: 50కి పైగా భాషల్లో ‘వారణాసి’.. డబ్బింగ్ కోసం 1600 మందికి పైగా ఆర్టిస్టులు!
-
Bobby Deol: అప్పటివరకు సరైన హిట్ లేదు.. ‘యానిమల్’తో ఓవర్‌నైట్ సెన్సేషన్.. ఇప్పుడు ఆ ఇమేజ్‌పై పోరాటం!
-
Bangladesh: బంగ్లాదేశ్‌లో దారుణం.. హిందూ కుటుంబాన్ని చంపి ఇంట్లోనే తిని, స్నానం.
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: 8 పరుగులకే ఔట్.. అరంగేట్రంలోనే వైభవ్ సూర్యవంశీ అట్టర్ ఫ్లాఫ్!
-
Home Remedies: వర్షాకాలంలో ఇంట్లో జెర్రులు, దోమలు, చీమలు, నల్లులకు చెక్ పెట్టే చిట్కాలు ఇవే!
-
Home Safety Tips: పాములను ఇంట్లోకి రాకుండా తరిమికొట్టే చిట్కాలు ఇవే.. ఈ జాగ్రత్తలు తీసుకోండి..
-
Maharashtra: “ఇది కదా విశ్వాసం అంటే”.. యజమానులు తిరిగిరారని తెలియక.. తిండి, నీళ్లు మానేసిన పెంపుడు కుక్క
-
Karnataka: పెళ్లి కొడుకు రాహుల్ గాంధీ ఫ్యాన్.. పెళ్లి క్యాన్సల్ చేసిన యువతి? షాకింగ్ కారణం!