Venky Anil5 : ఆ సినిమా రీమేక్ కాదు.. కీర్తి సురేష్ కీలక వ్యాఖ్యలు

Venky Anil5

Venky Anil5

Venky Anil5 : విక్టరీ వెంకటేష్, డైరెక్టర్ అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో వస్తున్న మోస్ట్ అవేటెడ్ క్రేజీ ప్రాజెక్ట్ #VenkyAnil5 (NKRAR2). ఈ సినిమాకు సంబంధించి గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో అనేక రకాల రూమర్స్ చక్కర్లు కొడుతున్నాయి. ముఖ్యంగా ఈ సినిమా మలయాళ గురువాయూర్ అంబల్ నడయిల్ సినిమాకు రీమేక్ అంటూ వస్తున్న వార్తలపై తాజాగా క్లారిటీ వచ్చేసింది. ఈ క్రేజీ ప్రాజెక్ట్‌లో నటిస్తున్న స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్ ఈ ప్రచారానికి చెక్ పెడుతూ కీలక విషయాలను వెల్లడించారు. నెట్టింట వైరల్ అవుతున్న వార్తలపై కీర్తి సురేష్ స్పందిస్తూ… ఈ సినిమా రీమేక్ అంటూ వస్తున్న రూమర్స్ పూర్తిగా అవాస్తవమని, వాటిలో ఎలాంటి నిజం లేదని స్పష్టం చేశారు. ఈ సినిమా గురించిన ప్రచారం బేస్‌లెస్ అని ఆమె తేల్చి చెప్పారు.

ఈ సినిమా ఏ సినిమాకూ రీమేక్ కాదు. ఇది దర్శకుడు అనిల్ రావిపూడి సొంతంగా రాసుకున్న ఒక సరికొత్త వైవిధ్యమైన కథ. అనిల్ రావిపూడి మార్క్ మార్కుతో, పక్కా ఒరిజినల్ స్క్రిప్ట్‌తో అవుట్ అండ్ అవుట్ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. వెంకటేష్-అనిల్ రావిపూడి కాంబోలో గతంలో వచ్చిన ‘ఎఫ్ 2’, ‘ఎఫ్ 3’, సంక్రాంతికి వస్తున్నాం, మనశంకర వర ప్రసాద్ గారు సినిమాలు బాక్సాఫీస్ వద్ద నవ్వుల పూయించాయి. ఇప్పుడు వీరిద్దరి కలయికలో వస్తున్న ఐదవ సినిమా కూడా రీమేక్ కాదని, పక్కా స్ట్రెయిట్ ఒరిజినల్ కథతోనే వస్తోందని కీర్తి సురేష్ కన్ఫర్మ్ చేయడంతో విక్టరీ వెంకటేష్ అభిమానులు ఫుల్ హ్యాపీగా ఉన్నారు. ఈ ఒరిజినల్ ఎంటర్‌టైనర్ సరికొత్త రికార్డులు సృష్టించడం ఖాయమని ఇండస్ట్రీ వర్గాలు భావిస్తున్నాయి.