సినిమా ఇండస్ట్రీలో జరిగే కొన్ని సంఘటనలు చూస్తే డెస్టినీ అనేది నిజమేనేమో అన్పిస్తూ ఉంటుంది. ఒక్కోసారి కొన్ని సినిమాల స్క్రిప్టులు ఒక హీరోతో చేయాలనుకున్నా అవి మరో హీరో ఒడిలో చేరిపోతాయి. ఆ సినిమాలు హిట్ అయితే, ఆ సినిమాలను తిరస్కరించిన హీరోలు ఆ బ్లాక్ బస్టర్ లను చేజార్చుకున్నందుకు పశ్చాత్తాపపడతారు. మరి వాళ్ళు రిజెక్ట్ చేసిన సినిమాలు డిజాస్టర్ అయితే… ఇప్పుడు సీనియర్ హీరో వెంకటేష్ విషయంలో అలాగే జరిగింది. ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద పరాజయం పాలైన రెండు బోరింగ్ చిత్రాల నుండి వెంకటేష్ తప్పించుకున్నాడు. ఆ రెండు సినిమాలు ఏంటంటే… “రాధే శ్యామ్”, “ఆడవాళ్లు మీకు జోహార్లు”.
Read Also : The Kashmir Files : నటి, దర్శకుడికి వ్యతిరేకంగా ఫత్వా జారీ…!
దర్శకుడు కిషోర్ తిరుమల మొదట్లో వెంకటేష్‌తో “ఆడవాళ్లు మీకు జోహార్లు” సినిమా చేయాలని ప్లాన్ చేశారు. ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా జరిగాయి. కానీ కొన్ని కారణాల వల్ల వెంకటేష్ ఈ ప్రాజెక్ట్ నుండి వెనక్కి తగ్గాడు. చివరికి కిషోర్ ఆ సినిమాను శర్వానంద్ తో చేశాడు. ఎట్టకేలకు “ఆడవాళ్లు మీకు జోహార్లు” చిత్రం గత వారం తెరపైకి వచ్చి బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్‌గా నిలిచింది. ఇక “రాధే శ్యామ్”ని కూడా ముందుగా వెంకటేష్ చేయాలనుకున్నారు. మొదట ఈ సినిమా అసలు ఆలోచనతో చంద్రశేఖర్ యేలేటి వెంకీ మామను కలిశాడట. కానీ కొన్ని తెలియని కారణాల వల్ల ఈ ప్రాజెక్ట్ కార్యరూపం దాల్చలేదు. తర్వాత రాధాకృష్ణ కుమార్ అదే ఐడియాని తీసుకుని ప్రభాస్ కోసం డెవలప్ చేశాడు. మార్చ్ 11న వెండితెరపైకి వచ్చిన “రాధేశ్యామ్”కు ఓ మోస్తరు రెస్పాన్స్ వస్తోంది. వెంకటేష్ అదృష్టవశాత్తూ ఈ రెండు సినిమాల నుండి తప్పించుకున్నాడన్నమాట.
