Venkatesh : రెండు భారీ డిజాస్టర్ల నుంచి తప్పించుకున్న వెంకీ మామ !!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సినిమా ఇండస్ట్రీలో జరిగే కొన్ని సంఘటనలు చూస్తే డెస్టినీ అనేది నిజమేనేమో అన్పిస్తూ ఉంటుంది. ఒక్కోసారి కొన్ని సినిమాల స్క్రిప్టులు ఒక హీరోతో చేయాలనుకున్నా అవి మరో హీరో ఒడిలో చేరిపోతాయి. ఆ సినిమాలు హిట్ అయితే, ఆ సినిమాలను తిరస్కరించిన హీరోలు ఆ బ్లాక్ బస్టర్ లను చేజార్చుకున్నందుకు పశ్చాత్తాపపడతారు. మరి వాళ్ళు రిజెక్ట్ చేసిన సినిమాలు డిజాస్టర్ అయితే… ఇప్పుడు సీనియర్ హీరో వెంకటేష్ విషయంలో అలాగే జరిగింది. ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద పరాజయం పాలైన రెండు బోరింగ్ చిత్రాల నుండి వెంకటేష్ తప్పించుకున్నాడు. ఆ రెండు సినిమాలు ఏంటంటే… “రాధే శ్యామ్”, “ఆడవాళ్లు మీకు జోహార్లు”.
Read Also : The Kashmir Files : నటి, దర్శకుడికి వ్యతిరేకంగా ఫత్వా జారీ…!
Also Read
- బండోడి ట్యూన్‌కి బక్కోడి పాట.. Itlu Arjuna First Single ప్రోమో అదిరింది!
- Pawan Kalyan: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌తో టాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్స్ భేటీ.. పర్సంటేజ్ గొడవకు ముగింపు పలికినట్లేనా?
- Jagapathi Babu: ‘పెద్ది’ లో ‘పెద్దాయన’ పని అయిపోయింది.. డబ్బింగ్ కంప్లీట్ చేసిన అప్పలసూరి!
- Over Your Dead Body: ఈ భార్యాభర్తల కన్నింగ్ ప్లాన్‌కు బుర్రపాడు... మెంటలెక్కించే ట్విస్టులు మావా
దర్శకుడు కిషోర్ తిరుమల మొదట్లో వెంకటేష్‌తో “ఆడవాళ్లు మీకు జోహార్లు” సినిమా చేయాలని ప్లాన్ చేశారు. ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా జరిగాయి. కానీ కొన్ని కారణాల వల్ల వెంకటేష్ ఈ ప్రాజెక్ట్ నుండి వెనక్కి తగ్గాడు. చివరికి కిషోర్ ఆ సినిమాను శర్వానంద్ తో చేశాడు. ఎట్టకేలకు “ఆడవాళ్లు మీకు జోహార్లు” చిత్రం గత వారం తెరపైకి వచ్చి బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్‌గా నిలిచింది. ఇక “రాధే శ్యామ్”ని కూడా ముందుగా వెంకటేష్ చేయాలనుకున్నారు. మొదట ఈ సినిమా అసలు ఆలోచనతో చంద్రశేఖర్ యేలేటి వెంకీ మామను కలిశాడట. కానీ కొన్ని తెలియని కారణాల వల్ల ఈ ప్రాజెక్ట్ కార్యరూపం దాల్చలేదు. తర్వాత రాధాకృష్ణ కుమార్ అదే ఐడియాని తీసుకుని ప్రభాస్ కోసం డెవలప్ చేశాడు. మార్చ్ 11న వెండితెరపైకి వచ్చిన “రాధేశ్యామ్”కు ఓ మోస్తరు రెస్పాన్స్ వస్తోంది. వెంకటేష్ అదృష్టవశాత్తూ ఈ రెండు సినిమాల నుండి తప్పించుకున్నాడన్నమాట.
తాజావార్తలు
-
OTR : తెలంగాణ బీజేపీ నాయకులకు ఢిల్లీ అధిష్టానం వార్నింగ్ ఇచ్చిందా?
-
Siddaramaiah: కర్ణాటకలో ఉత్కంఠకు తెర.. గురువారం గుడ్‌బై చెప్పనున్న సిద్ధరామయ్య!
-
Khaja Mohijuddin: వక్ఫ్ బోర్డు భూముల పోరాటమే ప్రాణం తీసిందా? సెకండ్ హ్యాండ్ ‘స్కార్పియో’తో లాయర్‌ను లేపేసిన కిల్లర్స్!
-
Vizag Bhimili Murder: ప్రియుడి మోజులో పచ్చని సంసారంలో నిప్పులు.. భర్తను చున్నీతో చంపేసిన ఇల్లాలు!
-
Story Board : పెట్రోల్ భారం.. దేశంలో పెరుగుతున్న ద్రవ్యోల్బణం.. ఆర్థిక వ్యవస్థ ఎటు వైపు?
ట్రెండింగ్
-
రూ.11,999కే 6000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Lava SHARK 2 5G లాంచ్..!
-
వాతావరణం మారితే కలర్ మారుతున్న ఫోన్.. 12 కలర్ వేరియంట్స్, సరికొత్త AI ఫీచర్లతో Infinix HOT 70 లాంచ్.!
-
Nitish Kumar Reddy Birthday: టెక్నిక్ + టాలెంట్ + టెంపరమెంట్.. విశాఖ కుర్రాడి జర్నీ.!
-
Chicken Pickle Recipe: 4 నెలలు పాడవకుండా ఉండే ఆంధ్ర స్టైల్ స్పైసీ ‘చికెన్ పచ్చడి’.. ఒకసారి తింటే మళ్లీ మళ్లీ తినాలినిపించేలా చేయండి ఇలా.!
-
AIతో ఇంటర్వ్యూ మోసాలు.. కంపెనీల కొత్త ప్లాన్.!