VenkyAnil5: సెట్స్‌పైకి వెంకటేష్.. #VenkyAnil5 షూటింగ్ కు మరింత ఊపు.. కీలక షెడ్యూల్ షురూ!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
VenkyAnil5: విక్టరీ వెంకటేష్, నందమూరి కల్యాణ్ రామ్ తొలిసారి కలిసి నటిస్తున్న మల్టీస్టారర్‌పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. బ్లాక్‌బస్టర్ దర్శకుడు అనిల్ రావిపూడి తెరకెక్కిస్తున్న #VenkyAnil5 ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఫ్యామిలీ ఎంటర్టైనర్లకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచిన అనిల్ రావిపూడి, ఇద్దరు స్టార్ హీరోలను ఒకే తెరపై ఎలా చూపించబోతున్నారన్న ఆసక్తి అభిమానుల్లో రోజురోజుకూ పెరుగుతోంది. షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై నిర్మాత సాహు గరపాటి ఈ చిత్రాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. సురేష్ ప్రొడక్షన్స్, శ్రీమతి అర్చన, జీ స్టూడియోస్ సమర్పిస్తున్న ఈ ప్రాజెక్ట్ ప్రస్తుతం కీలక షెడ్యూల్లోకి అడుగుపెట్టింది. ఇటీవల నందమూరి కల్యాణ్ రామ్ పుట్టినరోజు సందర్భంగా విడుదలైన ఆయన ట్రెడిషనల్ ఫస్ట్ లుక్ పోస్టర్‌కు మంచి స్పందన లభించింది. అలాగే కల్యాణ్ రామ్‌పై ఓ పాట చిత్రీకరణను కూడా చిత్రబృందం విజయవంతంగా పూర్తి చేసింది. ఈ తొలి షెడ్యూల్లో కీర్తి సురేష్, కృతి శెట్టి కూడా పాల్గొన్నారు.
తాజాగా విక్టరీ వెంకటేష్ సెట్స్‌పైకి రావడంతో షూటింగ్ మరింత వేగం అందుకుంది. భారీ సెట్లో వెంకటేష్, కల్యాణ్ రామ్, కీర్తి సురేష్, కృతి శెట్టి కలిసి కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. చిత్ర నిర్మాణంలో ఈ లాంగ్ షెడ్యూల్ అత్యంత కీలకమైనదిగా భావిస్తున్నారు. ముఖ్యంగా వెంకటేష్, కల్యాణ్ రామ్ కలిసి కనిపించే సన్నివేశాలు సినిమాకు హైలెట్ గా నిలుస్తాయని యూనిట్ వర్గాలు చెబుతున్నాయి. ఇద్దరి మధ్య ఉండే ఆన్‌స్క్రీన్ కెమిస్ట్రీ, అనిల్ రావిపూడి కామెడీ టైమింగ్‌తో కలిసి ప్రేక్షకులకు పూర్తి స్థాయి వినోదాన్ని అందించనుందనే అంచనాలు ఉన్నాయి. ఈ చిత్రంలో వెంకటేష్‌కు జోడీగా కీర్తి సురేష్ నటిస్తుండగా, కల్యాణ్ రామ్ సరసన కృతి శెట్టి కనిపించనున్నారు. సెంటిమెంట్, కామెడీ, పండుగ వాతావరణం, మాస్ ఎలిమెంట్స్ తో ఈ సినిమాను రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది. సంక్రాంతి సీజన్‌కు తగ్గట్టుగా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునేలా కథను సిద్ధం చేసినట్లు సమాచారం.
Also Read
- AA23 Update: లోకేష్ స్టైల్ రెడీ.. అల్లు అర్జున్ అభిమానులకు త్వరలో బిగ్ సర్ప్రైజ్!
- Lenin: థియేటర్లకు ముందే 'లెనిన్' జాక్‌పాట్.. నాన్ థియేట్రికల్ రైట్స్‌తో రూ.34 కోట్ల వసూళ్లు!
- Chiru158: మెగాస్టార్ మాస్ మోడ్.. హైదరాబాద్‌లో భారీ యాక్షన్ సీక్వెన్స్ షూట్!
- Ramayana: హాలీవుడ్ డిస్ట్రిబ్యూషన్ దిశగా 'రామాయణం'.. ప్రపంచవ్యాప్త విడుదలపై ఊహాగానాలు
టెక్నికల్ గా కూడా ఈ సినిమాకి మంచి టీమ్ పనిచేస్తోంది. సంగీతాన్ని జి.వి. ప్రకాష్ కుమార్ అందిస్తుండగా, సినిమాటోగ్రఫీ సమీర్ రెడ్డి నిర్వహిస్తున్నారు. ఎడిటర్‌గా తమ్మిరాజు, ఆర్ట్ డైరెక్టర్‌గా ఎ.ఎస్. ప్రకాష్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా ఎస్. కృష్ణ వ్యవహరిస్తున్నారు. కథ, స్క్రీన్‌ప్లేతో పాటు దర్శకత్వ బాధ్యతలను అనిల్ రావిపూడి స్వయంగా చేపట్టారు. ప్రస్తుతం చిత్రీకరణ వేగంగా కొనసాగుతున్న ఈ మల్టీస్టారర్‌ను 2027 సంక్రాంతి సందర్భంగా భారీ స్థాయిలో విడుదల చేయాలని చిత్రబృందం లక్ష్యంగా పెట్టుకుంది. వెంకటేష్, కల్యాణ్ రామ్ కాంబినేషన్‌తో పాటు అనిల్ రావిపూడి మార్క్ ఎంటర్టైన్మెంట్ కలిసివస్తుండటంతో, ఈ సినిమా ఇప్పటికే టాలీవుడ్లో అత్యంత ఆసక్తికరమైన ప్రాజెక్టుల్లో ఒకటిగా మారింది.
- Tags
- cinema
- VenkyAnil5
తాజావార్తలు
-
VenkyAnil5: సెట్స్‌పైకి వెంకటేష్.. #VenkyAnil5 షూటింగ్ కు మరింత ఊపు.. కీలక షెడ్యూల్ షురూ!
-
Sanju Samson: సంజు శాంసన్‌కు బైబై చెప్పేశారా..? మౌనం వీడిన బీసీసీఐ
-
AA23 Update: లోకేష్ స్టైల్ రెడీ.. అల్లు అర్జున్ అభిమానులకు త్వరలో బిగ్ సర్ప్రైజ్!
-
Lenin: థియేటర్లకు ముందే ‘లెనిన్’ జాక్‌పాట్.. నాన్ థియేట్రికల్ రైట్స్‌తో రూ.34 కోట్ల వసూళ్లు!
-
IND vs ZIM: మ్యాచ్ విన్నర్లకు నో ఛాన్స్.. ఒక్క వికెట్ తీయని ఆటగాడికి చోటు!
ట్రెండింగ్
-
టూరిస్టులకు గుడ్ న్యూస్.. ఒక్క రోజులో 5 అద్భుత గమ్యస్థానాలు.! TSTDC అదిరిపోయే టూర్ ప్యాకేజీ.!
-
7,200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Vivo నుంచి కొత్త G5i, G5z స్మార్ట్ఫోన్లు లాంచ్..!
-
Black Jamun Jam: ప్రిజర్వేటివ్స్ అవసరం లేకుండానే.. 6 నెలలు నిల్వ ఉండే ‘నేరేడు జామ్’ ఇంట్లోనే చేయండి ఇలా.!
-
TGPSC Recruitment: ఉద్యోగార్థులకు గుడ్‌న్యూస్.. టీజీపీఎస్సీ నుంచి రెండు నోటిఫికేషన్లు విడుదల.!
-
Telangana Drought Alert: వాన జాడే లేదు.. కరువు కోరల్లోకి తెలంగాణ.. రైతుల్లో పెరుగుతున్న ఆందోళన!