పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన లేటెస్ట్ చిత్రం ‘హరి హర వీరమల్లు’. ధర్మం కోసం పోరాడే యోధుడి పాత్రలో పవన్ కళ్యాణ్ అద్భుతంగా నటించారు. ప్రముఖ నిర్మాత ఎ.ఎం. రత్నం నిర్మించిన ఈ పీరియాడికల్ డ్రామాకు ఎ.ఎం. జ్యోతి కృష్ణ, క్రిష్ జాగర్లమూడి దర్శకులు. నిధి అగర్వాల్, బాబీ డియోల్ ముఖ్య పాత్రలు పోషించారు. ఎం.ఎం. కీరవాణి సంగీతం అందించారు. జూలై 24న వరల్డ్ వైడ్ గా థియేటర్స్ లో విడుదల అయిన ‘హరి హర వీరమల్లు’ ఆడియెన్స్ నుండి మిశ్రమ స్పందన రాబట్టింది. ముఖ్యంగా VFX వర్క్ పై భారీ నెగిటివిటీ తెచ్చుకుంది.
కాగా ఇప్పడు ఈ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ కు వచ్చేసింది. ఎలాంటి ఆర్భాటం లేకుండా ఓటీటీ స్ట్రీమింగ్ కు తీసుకువచ్చారు. రిలీజ్ కు ముందు ఈ సినిమా ఓటీటీ రైట్స్ ను అమెజాన్ ప్రైమ్ భారీ ధరకు కొనుగోలు చేసింది. రిలీజ్ అయినా నాలుగు వారాలకు స్ట్రీమింగ్ చేసేలా ఒప్పందం చేసుకోగా థియేటర్స్ లో ప్లాప్ గా మారడంతో వారం రోజుల ముందుగానే స్ట్రీమింగ్ కు తీసుకువచ్చింది అమెజాన్. అయితే ఓటీటీ వర్షన్ లో పవన్ కళ్యాణ్ మరియు బాబీ డియోల్ మధ్య క్లైమాక్స్ సీక్వెన్స్ ట్రిమ్ చేసారు. ఎండింగ్ లో అసుర హనుమ సాంగ్ ను యాడ్ చేసారు. అలాగే కొన్నినాసిరకం VFX షార్ట్స్ కూడా తొలగించారు. థియేటర్స్ ప్లాప్ అయిన వేరమల్లు న్యూ వర్షన్ తో అమెజాన్ ప్రైమ్ లోకి వచ్చాడు. మరి ఓటీటీ లో ఆడియెన్స్ నుండి ఎలాంటి స్పందన వస్తుందో చూడాలి.