సమ్మర్ వచ్చేస్తోంది. వెకేషన్స్ మొదలైపోయాయి. తారలు మాల్దీవుల బాట పట్టారు. ఇప్పటికే పాలూరు తారలు మాల్దీవుల్లో ఎంజాయ్ చేస్తూ బికినీ ట్రీట్ ఇస్తూ అభిమానులకు నిద్ర లేకుండా చచేశారు. ఇక తాజాగా హీరోయిన్ వేదిక తన వంతు అన్నట్లు మాల్దీవుల్లో రచ్చ షురూ చేసింది. బాణం, ముని సినిమాలతో టాలీవుడ్ లో మంచి పేరు తెచ్చుకున్న వేదిక ప్రస్తుతం కోలీవుడ్ లో సెటిల్ అయిపోయిన సంగతి తెలిసిందే. ఇక నిత్యం సోషల్ మీడియాలో హాట్ హాట్ ఫొటోలతో కుర్రకారు గుండెల్లో కొలువుండిపోయిన అమ్మడు మాల్దీవుల్లో రచ్చ చేసిన ఫోటోలను షేర్ చేసి సెగలు పుట్టిస్తోంది.
బ్లాక్ అండ్ వైట్ ప్రింటెడ్ టూపీస్ బికినీ ధరించిన వేదిక తన శరీర సౌష్టవంతో తో పిచ్చెక్కిస్తోంది. కళ్లకి నల్లటి కూలింగ్ గ్లాసెస్.. మెడలో చైన్ ..సన్నటి శరీరాకృతితో మరింత ఆకర్షణీయంగా కనిపిస్తోంది.ఇక అమ్మడి టోన్డ్ బాడీ మీద ఎర్రటి సూర్య కిరణాలు పది మరింత వెలుగును విరజిమ్ముతున్నాయి. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి. ఇకపోతే ప్రస్తుతం వేదిక జంగిల్ అనే బై లింగువల్ సినిమాలో నటిస్తోంది.