మెగాస్టార్ చిరంజీవి హీరోగా వశిష్ట దర్శకత్వంలో విశ్వంభరా అనే సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. త్రిష హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాని అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ తాజాగా అన్నపూర్ణ స్టూడియోస్ లో నిర్మించిన ప్రత్యేక సెట్ లో జరుగుతోంది ఈ సందర్భంగా ఒక ఆసక్తికరమైన విషయం తెర మీదకు వచ్చింది. అదేమిటంటే ఈ సినిమా కోసం పెద్ద చెవులు వున్న వారి లోకం సృష్టించినట్లు తెలుస్తోంది. నిజానికి ఇలాగే నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన ఆదిత్య 369 సినిమాలో ఒక సాంగ్ కోసం మరుగుజ్జుల లోకాన్ని సృష్టించారు. ఇప్పుడు అదే ప్యాట్రన్ లో విశ్వంభర కోసం కూడా సపరేట్గా ఎత్తుగా ఉన్న మనుషులకు బారు చెవులు వండేలా ఒక లోకం ఉంటుందని దానికి సంబంధించిన సీన్స్ ప్రస్తుతం షూట్ చేస్తున్నారని తెలుస్తోంది.
Also Read; Kakinada: అమ్మవారి గుడిలో హుండీని ఎత్తుకెళ్లి పోయిన దొంగ..
ఇక ఈ సినిమాలో ఇప్పటికే త్రిషతోపాటు మరికొంతమంది హీరోయిన్లు నటిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. అందులో భాగంగా ఆషికా రంగనాథ్ ఈ సినిమాలో కీలకపాత్రలో నటిస్తున్నట్లు ఇప్పటికే అధికారిక ప్రకటన వెలువడింది. ఈ సినిమాను యువి క్రియేటివ్స్ బ్యానర్ మీద అత్యంత భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. కాస్త సోషియో ఫాంటసీ టచ్ ఉండడంతో సంక్రాంతికి అయితే కరెక్ట్ గా ఉంటుందని ఇప్పటికే రిలీజ్ డేట్ మీద కర్చీఫ్ వేశారు. వచ్చే ఏడాది జనవరి 10వ తేదీన సినిమా రిలీజ్ చేసినందుకు ప్లాన్ చేస్తున్నారు. అందువల్ల షూటింగ్ కూడా శరవేగంగా పూర్తి చేసే పనిలో ఉన్నారు మేకర్స్.