Vande Mataram: వాఘా బోర్డర్ లో వందేమాతరం లాంచ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Varun Tej Vandemataram Song Released: మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ఎయిర్ ఫోర్స్ యాక్షన్ అడ్వెంచర్ ‘ఆపరేషన్ వాలెంటైన్’ ఫస్ట్ సింగిల్ ‘వందేమాతరం’ అమృతసర్‌లోని ఐకానిక్ వాఘా సరిహద్దులో లాంచ్ చేసిన మొట్టమొదటి తెలుగు పాటగా చరిత్ర సృష్టించింది. ఫస్ట్ స్ట్రైక్ వీడియో అద్భుతమైన రెస్పాన్స్ తెచ్చుకున్న తరువాత, ఈ పాటను రిపబ్లిక్ డే వీక్ లో వరుణ్ తేజ్, మానుషి చిల్లార్‌తో సహా మొత్తం టీమ్ సమక్షంలో లాంచ్ చేశారు. టైటిల్ సూచించినట్లుగా వందేమాతరం దేశ స్ఫూర్తిని చాటే ఒక దేశభక్తి గీతం. వైమానిక దళ సైన్యం పెద్ద యుద్ధానికి సిద్ధమవుతున్నట్లు చూపే ఈ పాట తమ దేశ రక్షణకు పోరాడే ధైర్యవంతులందరికీ నివాళి. ఈ పాట ఉత్తేజాన్ని కలిగిస్తూ, గర్వంగా నిలబడేలా స్ఫూర్తిని కలిగించేలా ఉంది. ఈ సినిమాతో హిందీలో అరంగేట్రం చేస్తున్న వరుణ్ తేజ్ ఈ పాటలో యూనిఫాంలో ఫిట్‌గా, అద్భుతంగా కనిపించారు.
Captain Miller Trailer: ధనుష్ నట విశ్వరూపం.. ట్రైలర్ మాత్రం అరాచకం
Also Read
- Samantha Seemantham: శ్రీవిద్య పద్ధతిలో సమంత సీమంతం.. "నా బిడ్డకు దక్కిన వరం" అంటూ ఎమోషనల్ పోస్ట్!
- The Paradise: ఆడియన్స్ కోసమే ఆ రిస్క్ చేశాం.. 'ది ప్యారడైజ్' షూటింగ్ డిలే వెనుక అసలు నిజాలు చెప్పిన శ్రీకాంత్ ఓదెల!
- Srikanth Odela: ఒకప్పుడు సుకుమార్ శిష్యుడిగా.. ఇప్పుడు ఆయన కుర్చీలో డైరెక్టర్‌గా.. శ్రీకాంత్ ఓదెల లైఫ్ సర్కిల్ మూమెంట్!
- Ram Charan: మెగాస్టార్ ఇంట్లో వినాయక చవితి వేడుకలు.. ఫ్యామిలీతో కలిసి రామ్ చరణ్ ప్రత్యేక పూజలు! వైరల్ వీడియో..
తెలుగులో అరంగేట్రం చేస్తున్న మానుషి చిల్లర్ యుద్ధంలో ఉన్న తన బాయ్ ఫ్రెండ్ (వరుణ్ తేజ్) గురించి ఆందోళన చెందే రాడార్ ఆఫీసర్‌గా కనిపించింది. సరస్వతీపుత్ర రామజోగయ్య శాస్త్రి సాహిత్యం శక్తివంతమైన పదాలతో కూడి ఉత్తేజం, ఉత్సాహం నింపింది. మిక్కీ జె. మేయర్ సంగీతం అందించిన ఈ పాటను తెలుగులో అనురాగ్ కులకర్ణి, హిందీలో సుఖ్వీందర్ సింగ్ చక్కగా పాడారు. అద్భుతమైన కంపోజిషన్, దేశభక్తి పంక్తులు, మంత్రముగ్ధులను చేసే వోకల్స్, కట్టిపడేసి విజువల్స్ తో వందేమాతరం పాట బ్లాక్ బస్టర్ నంబర్ అయ్యేలా కనిపిస్తోంది. ఆపరేషన్ వాలెంటైన్’ సినిమాను సోనీ పిక్చర్స్ ఇంటర్నేషనల్ ప్రొడక్షన్స్, రినైసన్స్ పిక్చర్స్ సందీప్ ముద్ద నిర్మించారు. నందకుమార్ అబ్బినేని, గాడ్ బ్లెస్ ఎంటర్‌టైన్‌మెంట్ (వకీల్ ఖాన్) సహా నిర్మాతలుగా వ్యవహరిస్తున్న ఈ సినిమాకి శక్తి ప్రతాప్ సింగ్ హడా దర్శకత్వం వహిస్తున్నారు. ఇక ఈ సినిమా తెలుగు, హిందీలో ఫిబ్రవరి 16 న విడుదల కానుంది.
తాజావార్తలు
-
India-China Ties: ప్రధాని మోడీ ఒక్క ప్రకటనతో చైనాలో ఆనందం..
-
Gurugram: ఆమె అమ్మాయినే తెలియదు.. గురుగ్రామ్ బైకర్‌ను ఢీకొట్టిన నిందితుడు వింత వాదన
-
Smart Phone Prices: ఇకపై స్మార్ట్ఫోన్లు మరింత చీప్? 18 శాతం నుంచి 5 శాతానికి తగ్గనున్న జీఎస్టీ..?
-
India’s Artificial Sun: భారత్ ‘ఆర్టిఫిషియల్ సన్’ ప్రయోగం సక్సెస్.. సూర్యుడి కేంద్రం కంటే 20 రెట్లు వేడి!
-
Trump: తెలివైన అధ్యక్షుడు ఉండగా ఏఐకి కళ్లెం వేయక్కర్లేదు.. ట్రంప్ కీలక వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Ganga Aarti in London: లండన్‌లో తొలిసారి గంగా హారతి.. థేమ్స్ నది తీరంలో ఆధ్యాత్మిక సందడి.!
-
Ragi Drumstick Leaves Roti: డయాబెటిస్, బీపీ ఉన్నవారికి సంపూర్ణ ఆహారం.. సంపూర్ణ పోషణనిచ్చే ‘రాగి మునగాకు రొట్టె’ చేసేయండి ఇలా.!
-
Beetroot Pachadi: బీట్రూట్ అంటే నచ్చదా? ఇలా పచ్చడి చేసి పెట్టండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు.!
-
India Women: నాలుగింటిలో నాలుగు.. ఆరింటిలో నాలుగు.. ఆసియా కప్‌లో భారత్ హవా!
-
Rajyogam: 200 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!