Varun Tej- Lavanya Thripati Marriage Date Fixed: మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్- స్టార్ హీరోయిన్ లావణ్య త్రిపాఠి ప్రేమ వార్తలు హల్చల్ చేస్తుండగానే అనూహ్యంగా ఎంగేజ్మెంట్ చేసేసుకుని అందరికీ షాక్ ఇచ్చాడు. ఇక వీరి వివాహం గురించి అనేక వార్తలు ఇప్పటికే అనేక సార్లు తెరమీదకు వస్తుండగా ఇప్పుడు మరోమారు ఓ వార్త నెట్టింట వైరల్ అవుతోంది. ఆగస్టు 24న ఇటలీలో వీరి వివాహం గ్రాండ్‌గా జరగనుందని ఇప్పుడు కొత్త ప్రచారం తెర మీదకు వచ్చింది. గత నెలలో వీరు ఎంగేజ్‌మెంట్ చేసుకోగా ఆ తర్వాత ఫారిన్ ట్రిప్‌కు వెళ్లి కూడా ఎంజాయ్ చేశారు. ఇటీవలే కాఫీ డేట్‌కు కూడా వెళ్లగా ఈ విషయాన్ని నేరుగా వారే తమ ఇన్‌స్టా స్టోరీస్‌లో ఒకరి ఫోటోను మరొకరు షేర్ చేసి మరీ వెల్లడించారు.
Sammohanuda: ఏయ్.. ఏయ్.. కిరణ్ అన్నా.. రాధికతో రొమాన్స్.. ఈ రేంజ్ లోనా
అయితే నిజమో కాదో తెలియదు కానీ ఆగస్టు 24న మెగా ఇంట పెళ్లి సందడి జరిగే అవకాశాలున్నాయని అంటున్నారు. ఇక ఫారెన్ లోనే వరుణ్ – లావణ్య ఇప్పటి నుంచే పెళ్లికి సంబంధించిన షాపింగ్ చేయడం మొదలు పెట్టారని టాక్ వినిపిస్తోంది. ఇక వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి మిస్టర్ – అంతరిక్షం అనే రెండు సినిమాల్లో కూడా కలిసి నటించగా మిస్టర్ సినిమా షూటింగ్ సమయంలోనే వరుణ్ తేజ్ – లావణ్య త్రిపాఠి మధ్య ప్రేమ చిగురించిందని అంటున్నారు. ఆ ప్రేమే పెళ్లి వరకూ దారి తీసిందని తెలుస్తోంది. హైదరాబాద్ లో నాగబాబు ఇంటి వద్దనే అంగరంగ వైభవంగా వీరి నిశ్చితార్థం జరగగా కుటుంబ పెద్దలు, అతికొద్ది మంది సన్నిహితుల సమక్షంలో వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి ఉంగరాలు సైతం మార్చుకున్నారు. పెళ్లి కూడా ఇరు కుటుంబ పెద్దలు, అతికొద్ది మంది సన్నిహితుల సమక్షంలో విదేశాల్లో డెస్టినేషన్ వెడ్డింగ్ గా జరగనుందని అంటున్నారు. ఇక వివాహం జరిగిన అనంతరం సినీ – రాజకీయ ప్రముఖులకు భారీ విందు ఏర్పాటు చేయబోతున్నారని తెలుస్తోంది.