NTV Telugu Site icon

VarunLav: నెట్ ఫ్లిక్స్ లో వరుణ్ – లావణ్య పెళ్లి వీడియో.. రూ. 8 కోట్లకు ఫిక్స్..?

Varun

Varun

VarunLav: మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్- లావణ్య త్రిపాఠి పెళ్లి నవంబర్ 1 న ఇటలీలో గ్రాండ్ గా జరిగింది. ఐదేళ్లుగా ప్రేమించుకున్న ఈ జంట.. ఎట్టేకలకు పెళ్లి పీటలు ఎక్కారు. ఇక నవంబర్ 5 న వీరి రిసెప్షన్ హైదరాబాద్ లో గ్రాండ్ గా జరిగింది. ఇక ఇటలీలో పెళ్ళికి కేవలం మెగా, అల్లు కుటుంబాలు మాత్రమే పాల్గొనగా.. రిసెప్షన్ కు మాత్రం టాలీవుడ్ మొత్తం హాజరు అయ్యారు. ఇక వీరి పెళ్లి అయిన దగ్గరనుంచి వీరి పెళ్లి వీడియో నెట్ ఫ్లిక్స్ కొనుగోలు చేసిందని వార్తలు వినిపిస్తున్నాయి. స్టార్ సెలబ్రిటీల పెళ్లి వీడియోలను కొన్ని కోట్లకు కొనుగోలు చేసి.. తమ ఓటిటీలో స్ట్రీమింగ్ చేయడానికి నెట్ ఫ్లిక్స్ ఒప్పందం చేసుకుంటూ ఉంటుంది. ఇప్పటికీ చాలా మంది సెలబ్రిటీల పెళ్లిళ్లు నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అయ్యాయి.

Guntur Kaaram: ధమ్ మసాలా బిర్యానీ.. గుద్ది పారేయ్ గుంటూర్నీ

ఇక వరుణ్ లావణ్య పెళ్లి కూడా నెట్ ఫ్లిక్స్ కొనుగోలు చేసిందని, దాదాపు రూ. 8 కోట్లకు డీల్ ఫిక్స్ చేసిందని టాక్ నడిచింది. దీంతో ఇదంతా నిజమే అనుకోని ఎప్పుడెప్పుడు నెట్ ఫ్లిక్స్ లో ఈ పెళ్లి వీడియో వస్తుందో అని అభిమానులు ఎదురుచూస్తున్నారు. అయితే ఇదంతా ఫేక్ అని వరుణ్ తేజ్ పీఆర్ టీమ్ క్లారిటీ ఇచ్చింది. “వరుణ్‌-లావణ్యల పెళ్లి వీడియో ఓటీటీలో స్ట్రీమింగ్‌ అవుతుందని వస్తున్న వార్తల్లో నిజం లేదు. పెళ్లి వీడియో హక్కులను ఏ ఓటీటీ సంస్థకు అమ్మలేదు. దయచేసి అలాంటి బేస్‌లెస్‌ రూమర్స్‌ని నమ్మకండి” అని చెప్పుకొచ్చారు. దీంతో ఈ పుకార్లకు చెక్ పడింది.