Varun Tej: రిలీజ్‌కు ముందే వరుణ్ తేజ్ జాక్‌పాట్.. ‘కొరియన్ కనకరాజు’ రూ.26 కోట్ల బిజినెస్?

Korean Kanakaraju Teaser

Korean Kanakaraju Teaser

Varun Tej: మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా తెరకెక్కిన ఇండో-కొరియన్ హారర్ ఎంటర్‌టైనర్ ‘కొరియన్ కనకరాజు’. ఈ సినిమా రిలీజ్‌కు ముందే ట్రేడ్ వర్గాల్లో మంచి హైప్‌ను సొంతం చేసుకుంది. ప్రపంచవ్యాప్తంగా ఆగస్టు 7న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమా ఇప్పటికే నాన్-థియేట్రికల్ రైట్స్ ద్వారానే సుమారు రూ.26 కోట్ల ఆదాయాన్ని రాబట్టినట్లు సినీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. సుమారు రూ.38 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రానికి రిలీజ్‌కు ముందే అదిరిపోయే బిజినెస్ జరగడం విశేషం.

ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్, పాటలు ప్రేక్షకుల నుంచి మంచి స్పందనను అందుకోవడంతో ఈ సినిమాపై ట్రేడ్ వర్గాల్లో పాజిటివ్ బజ్‌ క్రియేట్ అయ్యింది. హారర్, కామెడీ అంశాలతో రూపొందిన ఈ ఇండో-కొరియన్ ప్రాజెక్ట్‌పై ప్రేక్షకుల్లో ఆసక్తి పెరుగుతోంది. ఇక థియేట్రికల్ బిజినెస్ కూడా ప్రీమియం రేట్లకే జరుగుతున్నట్లు సమాచారం. పలు ఏరియాల్లో డిస్ట్రిబ్యూషన్ రైట్స్‌కి మంచి డిమాండ్ కనిపిస్తోందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. దీంతో సినిమా రిలీజ్ తర్వాత ప్రేక్షకుల నుంచి పాజిటివ్ టాక్ వస్తే బాక్సాఫీస్ వద్ద బ్రేక్‌ఈవెన్ సాధించడం పెద్ద కష్టమేమీ కాదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. నాన్-థియేట్రికల్ రికవరీ, థియేట్రికల్ బిజినెస్‌కు వస్తున్న స్పందన, రిలీజ్‌కి ముందే ఏర్పడిన బజ్ వంటి అంశాలు ‘కొరియన్ కనకరాజు’కు పెద్ద ప్లస్‌గా మారాయని ట్రేడ్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ చిత్రం రిలీజ్ తర్వాత ప్రేక్షకులను ఎంత మేర ఆకట్టుకుంటుందో చూడాలి.