Varsha Bollamma: మేం చెట్లు, నదులు, కొండలు, జంతువులని పూజిస్తాం.. వర్ష బొల్లమ్మ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Varsha Bollamma Interview for Ooru Peru Bhairavakona: యంగ్ టాలెంటెడ్ హీరో సందీప్ కిషన్ నటిస్తున్న ఫాంటసీ అడ్వెంచర్ మూవీ ‘ఊరు పేరు భైరవకోన’. విఐ ఆనంద్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో కావ్య థాపర్, వర్ష బొల్లమ్మ హీరోయిన్ లుగా నటించారు. హాస్య మూవీస్ బ్యానర్‌పై రాజేష్ దండా నిర్మించగా ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్‌పై అనిల్ సుంకర సమర్పిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ప్రమోషనల్ కంటెంట్ ప్రేక్షకులలో హ్యుజ్ బజ్‌ని క్రియేట్ చేశాయి. ఈ చిత్రం ఫిబ్రవరి 16న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వస్తున్న నేపథ్యంలో హీరోయిన్ వర్ష బొల్లమ్మ ‘ఊరు పేరు భైరవకోన’ విశేషాలు విలేకరుల సమావేశంలో పంచుకున్నారు.
‘ఊరు పేరు భైరవకోన’ ప్రాజెక్ట్ లోకి ఎలా వచ్చారు ?
దర్శకుడు విఐ ఆనంద్ ఈ కథ చెప్పారు. నాకు చాలా కొత్తగా, అద్భుతంగా అనిపించింది, అసలు ఇలాంటి కథ ఎలా అలోచించగలిగారో అనిపించింది. ఇలాంటి పాత్ర గతంలో ఎప్పుడూ చేయలేదు, చేయగలనా? లేదా? అని ఆలోచించుకోవడానికి కొంత సమయం అడిగాను. తర్వాత ఆనంద్ కంప్లీట్ నేరేషన్ ఇచ్చారు. అది వినగానే చాలా ఆనందంగా అనిపించి చేయగలననే నమ్మకం కుదిరింది.
Also Read
- Vijay Deverakonda: సీఎం విజయ్‌తో విజయ్ దేవరకొండ, రష్మిక భేటీ.. రౌడీ హీరో పోస్ట్ వైరల్!
- Nayanthara: నయన్ రాజకీయాల్లోకి వస్తున్నారా? ఒక్క మాటతో తేల్చేసిన భర్త విఘ్నేశ్!
- Jailer 2: టాలీవుడ్‌ను నెల్సన్ లైట్ తీసుకున్నారా?
- Kannada Actresses: క్రేజీ ప్రాజెక్టులు.. తేలని రిలీజ్లు.. టాలీవుడ్లో కన్నడ భామల బ్యాడ్ టైమ్!
‘ఊరు పేరు భైరవకోన’ లో మీ పాత్ర గురించి ?
ఇందులో భూమి అనే పాత్రలో కనిపిస్తా. భూమి ట్రైబల్ గర్ల్, తన వూర్లో తనొక్కరే చదువుకున్న అమ్మాయి. చూడటానికి అందంగా అమాయకంగా కనిపిస్తుంది, తప్పుని నిలదీసే ధైర్యం ఉన్న అమ్మాయి. ఆ పాత్ర బలం సినిమా చూస్తున్నప్పుడు ప్రేక్షకులకి అర్థమవుతుంది. స్వాతిముత్యం, మిడిల్ క్లాస్ మెలోడీస్ సినిమాల్లో గర్ల్ నెక్స్ట్ డోర్ పాత్రల్లో కనిపించా, ఇందులో మాత్రం గర్ల్ నెక్స్ట్ ఫారెస్ట్ పాత్ర అనాలి. ట్రైలర్ లో చూస్తే నాకు ఒక యాక్షన్ సీన్ ఉంటుంది. భూమి పాత్రలో చాలా స్ట్రెంత్, పవర్ వుంది.
ట్రైబల్ పాత్ర చేశారు కదా.. ఎలాంటి సవాళ్లు ఎదుర్కున్నారు ?
నేను హిల్ స్టేషన్(కూర్గ్) నుంచి వచ్చాను. ప్రకృతి జీవితంలో ఒక భాగం. నిజ జీవితంలో కూడా మేము చెట్లు, నదులు, కొండలు, జంతువులని పూజిస్తాం ఆ రకంగా భూమి పాత్ర నేను రిలేట్ చేసుకునే విధంగా వుంది.
సందీప్ కిషన్ తో వర్క్ చేయడం ఎలా అనిపించింది ?
సందీప్ కిషన్ అందరిని చాలా గౌరవంగా చూస్తారు. ప్రతి ఒక్కరితో ఎంతో ఆప్యాయంగా మాట్లాడతారు. ఆయన దయగల మనిషి, మంచి హ్యూమన్ బీయింగ్- గ్రేట్ కో స్టార్.
విఐ ఆనంద్ సినిమాలు చూశారా? ఈ పాత్రకు మిమ్మల్ని ఎంపిక చేయడానికి కారణం ఏమిటని అడిగారా ?
‘ఎక్కడికి పోతావు చిన్నవాడా’ సినిమా చూశా, చాలా నచ్చింది. అందులో అన్ని ఎలిమెంట్స్ ని చాలా అద్భుతంగా చూపించారు. ఆయనతో వర్క్ చేయడం చాలా ఎక్సయిటింగా అనిపించింది. ఈ కథ రాసినప్పుడే భూమి పాత్రకు నా పేరు రాసుకున్నారని తెలిసి చాలా ఆనందంగా అనిపించింది.
‘ఊరు పేరు భైరవకోన’ ప్రేక్షకులకు ఎలాంటి అనుభూతిని ఇస్తుంది ?
‘ఊరు పేరు భైరవకోన’ అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైనర్. ప్రేక్షకుడు ఎడ్జ్ ఆఫ్ ది సీట్ థ్రిల్లింగ్ ఎక్స్ పీరియన్స్ ని ఇస్తుంది. అద్భుతమైన సూపర్ నేచురల్ ఎలిమెంట్స్ ఉన్నాయి, ప్రేక్షకులు చాలా ఎంజాయ్ చేస్తారు. అలాగే ఇందులో చాలా మంచి సందేశం కూడా ఉంది.
పాత్రల ఎంపికలో చాలా పర్టిక్యులర్ గా ఉంటారు కదా?
-నిడివి తక్కువ ఉన్నప్పటికీ సినిమాలో ప్రాధాన్యత వున్న పాత్రలని చేయడానికి ఆసక్తి చూపిస్తా, ఇప్పటివరకు నేను చేసిన పాత్రలన్నీ అలా వచ్చినవే.
మీ అప్ కమింగ్ మూవీస్?
-ఒక మంచి ప్రాజెక్ట్ చేస్తున్నాను. దాని గురించి నిర్మాత త్వరలో తెలియజేస్తారు. తెలుగు తమిళ్ మలయాళంలో చిత్రాలు చేశా, త్వరలో కన్నడలో కూడా చేసే అవకాశం వుంది.
తాజావార్తలు
-
Papikondalu Boating: 70 రోజుల విరామం.. నేటి నుంచి పాపికొండలు విహారయాత్ర!
-
Vaibhav sooryavanshi: నాలుగో టీ20లో వైభవ్ సూర్యవంశీ..? వైరల్ గా మారిన పోస్ట్.!
-
Breaking Bad Actor: ‘బ్రేకింగ్ బ్యాడ్’ నటుడు ఆర్జే మిట్టే హఠాన్మరణం
-
AP Weather Update: ఏపీకి 4 రోజుల పాటు వర్ష సూచన!
-
New Mobile Launched: ఫోన్ ఛార్జింగ్ త్వరగా అయిపోతుందా.. ఈ కొత్త ఫోన్‌తో పరిష్కారం దొరికినట్లే..
ట్రెండింగ్
-
7 రోజుల బ్యాటరీ, ECG, GPSతో Google Fitbit Edge లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే!
-
Rishabh Pant Ruled Out: రిషబ్ పంత్ అవుట్.. కీలక ప్లేయర్ ఇన్.!
-
Pressure Cooker Safety: ప్రెషర్ కుక్కర్లో ఈ సమస్య ఉందా? అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు.!
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!