Varsha Bollamma Comments on Kumari Aunty: ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా కుమారి ఆంటీ అనే పేరు వైరల్ అవుతుంది. నిజానికి హైదరాబాద్ దుర్గం చెరువు దగ్గర ఐటీసీ కోహినూర్ హోటల్ ఎదురుగుండా ఒక ఫుడ్ స్టాల్ నడుపుకునే ఆమె అనూహ్యంగా వార్తల్లోకి ఎక్కింది. ఆమె ట్రోలింగ్ వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఆమెతో వీడియో చేస్తే పబ్లిసిటీ వస్తుందని ఊరు పేరు భైరవకోన సినిమా టీం భావించింది. అందులో భాగంగానే హీరో హీరోయిన్లు సందీప్ కిషన్ వర్ష బొల్లమ్మ ఇద్దరు ఆ స్టాల్ కి వెళ్లి భోజనం చేసి దాన్ని వీడియో షూట్ చేసి సోషల్ మీడియాలో రిలీజ్ చేశారు. ఎప్పుడైతే హీరో హీరోయిన్లు ప్రమోషన్స్ కోసం ఆమె స్టాల్ కి వెళ్లారో, ఒక్కసారిగా మీడియా దృష్టి మీద పడింది. మీడియాలో సోషల్ మీడియాలో మరింత వైరల్ కావడంతో ఆమె ఫుడ్ స్టాల్ కోసం జనం ఎగబడి రావడం మొదలుపెట్టారు. ట్రాఫిక్ జామ్ అవుతుందనే ఉద్దేశంతో పోలీసులు ఒకరోజు మొత్తం ఆమెని వ్యాపారం కూడా చేసుకోనివ్వలేదు.
Mouli Talks: ఏపీ క్యాపిటల్ పై జోక్.. తల్లితండ్రులను లాగొద్దు ప్లీజ్ అంటూ #90స్ మౌళి ట్వీట్
తర్వాత రేవంత్ రెడ్డి దృష్టికి ఆ విషయం వెళ్లడంతో ఆయన ఆమెను ఇబ్బంది పెట్టవద్దని పోలీసులకు సూచనలు చేశారు. అయితే ఇదే విషయం మీద వర్ష బొల్లమ్మ మాట్లాడుతూ ఆమె స్టాల్ ఒకరోజు మూత పెట్టడానికి తాము ఏమాత్రం కారణం కాదని అని చెప్పుకొచ్చారు. నిజానికి ఆమె ఫేమస్ అయ్యాకనే మేము అక్కడికి వెళ్ళాము ఆమెతో వీడియో చేసి రిలీజ్ చేశాము అందులో ఆమెను మేము ఫేమస్ చేయాల్సిన అవసరం లేదు అంటూ ఆమె చెప్పుకొచ్చింది. ఒకవేళ మేము వెళ్ళినా వెళ్లకపోయినా సరే ఆవిడ పాపులర్ అయ్యేదని వర్ష సమాధానం ఇచ్చారు. ‘ఊరు పేరు భైరవకోన’ సినిమాని ఈ శుక్రవారం విడుదల చేయాలని ప్లాన్ చేసినా ‘ఈగల్’ సినిమాకు సోలో రిలీజ్ కావాలని ఫిల్మ్ ఛాంబర్ కోరడంతో తమ సినిమాను వారం వాయిదా వేశారు. ఇప్పుడు ఈ సినిమాను ఫిబ్రవరి 16న విడుదల చేస్తున్నారు.