Varanasi: డైరెక్టర్ ఎస్.ఎస్. రాజమౌళి దర్శకత్వంలో సూపర్‌స్టార్ మహేశ్ బాబు, ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్రలో నటిస్తున్న అత్యంత ప్రతిష్ఠాత్మక చిత్రం ‘వారణాసి’. జక్కన్న దర్శకత్వంలో తెరకెక్కుతున్న మోస్ట్ అవైటెడ్ పాన్-వరల్డ్ మూవీ కావడంతో ఈ చిత్రంపై అంతర్జాతీయ స్థాయిలో భారీ అంచనాలు ఉన్నాయి. భారీ యాక్షన్ అడ్వెంచర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాకు సంబంధించి తాజాగా ఓ ఆసక్తికరమైన షూటింగ్ అప్డేట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ‘వారణాసి’లో మహేశ్ బాబుపై ఓ భారీ బుల్ ఫైట్ సీక్వెన్స్‌ను తెరకెక్కించనున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతుంది. సినిమాలో ఈ యాక్షన్ ఎపిసోడ్ అత్యంత కీలకంగా ఉండనుందని టాక్. ఇప్పటికే రిలీజ్ అయిన గ్లింప్స్‌లో మహేశ్ బాబు పాత్రకు సంబంధించిన పవర్ఫుల్ ఎలివేషన్‌లో బుల్ ఫైట్‌కు సంబంధించిన విజువల్ కనిపించడంతో.. తాజాగా వినిపిస్తున్న ఈ వార్త అభిమానుల్లో మరింత ఆసక్తిని పెంచుతోంది.
ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న సమాచారం ప్రకారం హైదరాబాద్ శివార్లలో వచ్చే వారం ఈ భారీ యాక్షన్ సీక్వెన్స్ షూటింగ్‌ను నిర్వహించేందుకు చిత్రబృందం సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. జక్కన్న ఈ బుల్ ఫైట్‌ను భారీ స్థాయిలో, హై-క్వాలిటీ విజువల్స్‌తో తెరకెక్కించేందుకు ప్రత్యేకంగా ప్లాన్ చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇక ఈ చిత్రానికి ఆస్కార్ విజేత ఎం.ఎం.కీరవాణి సంగీతం అందిస్తున్న సంగతి తెలిసిందే. అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ‘వారణాసి’ కథ పలు ప్రాంతాలు, విభిన్న కాలాల నేపథ్యంలో సాగనున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాను 2027 ఏప్రిల్ 7న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.

