Varalaxmi Sarathkumar: వరలక్ష్మీకి కాబోయే భర్తకు ముందే పెళ్లయ్యింది.. ఇదిగో సాక్ష్యం..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Varalaxmi Sarathkumar: తమిళ స్టార్ యాక్టర్ శరత్ కుమార్ వారసురాలిగా వరలక్ష్మీ శరత్ కుమార్ ఇండస్ట్రీకి పరిచయమైంది. మొదట హీరోయిన్ గా కెరీర్ మొదలుపెట్టినా కూడా తనకు హీరోయిన్ పాత్రలు సూట్ కావని విలనిజాన్ని ఎంచుకుంది. ఇప్పుడున్న ఇండస్ట్రీలో కుర్ర లేడీ విలన్ గా అమ్మడు ఒక గుర్తింపును తెచ్చుకుంది. ఒకప్పుడు కొద్దిగా బొద్దుగా ఉండే వరూ.. కష్టపడి బరువుతగ్గి నాజూగ్గా మారింది. ఇక అప్పట్లో ఈ చిన్నదాని లవ్ స్టోరీ, పెళ్లి గురించి ఎన్నో రూమర్స్ వచ్చాయి. హీరో విశాల్ తో వరూ ప్రేమాయణం నడిపింది, శరత్ కుమార్ వలన వీరి పెళ్లి ఆగిపోయిందని కూడా వార్తలు వచ్చాయి. అయితే తామిద్దరం మంచి ఫ్రెండ్స్ మాత్రమే అని వారు క్లారిటీ ఇచ్చేశారు. ఇక వరలక్ష్మీ.. తాను సింగిల్ గానే ఉంటాను అని, పెళ్లి చేసుకుంటే ఉపయోగం ఏది లేదని ఎన్నోసార్లు ఎన్నో ఇంటర్వ్యూల్లో చెప్పుకొచ్చింది. అయితే తాజాగా ఆమె.. తన ఎంగేజ్ మెంట్ పిక్స్ పెట్టడం అందరిని షాక్ కు గురి చేసింది. నికోలయ్ సచ్ దేవ్ అనే ఆర్ట్ గ్యాలరీ ఓనర్ తో వరలక్ష్మీ నిశ్చితార్థం అత్యంత బంధుమిత్రుల సమక్షంలో జరిగింది.
ఇక వరలక్ష్మీ భర్త స్థానాన్ని సంపాదించుకొనేటప్పటికీ నికోలయ్ కూడా ఇప్పుడు సెలబ్రిటీగా మారిపోయాడు. దీంతో అతను ఎవరు.. ? అతని బ్యాక్ గ్రౌండ్ ఏంటి..? అని అభిమానులు ఆరా తీయడం మొదలుపెట్టారు. అలా ఆరా తీయడంతో.. నికోలయ్ కు అంతకుముందే పెళ్లి అయ్యినట్లు అభిమానులు వెతికి కనిపెట్టారు. నికోలయ్ భార్య కవిత సచ్ దేవ్. ఆమె ఒక మోడల్. ఫ్యాషన్ రంగంలో ఆమె కొనసాగుతోంది. వీరిద్దరికి విబేధాల వలన విడాకులు అయ్యినట్లు సమాచారం. ఇక ఈ విషయం తెలియడంతో అభిమానులు.. ఏంటీ.. వరలక్ష్మీ కాబోయే భర్తకు ముందే పెళ్లయ్యిందా ..? అని నోర్లు నొక్కుకుంటున్నారు. ఇంకొంతమంది ఇప్పుడు ఇదే ఫ్యాషన్ గా మారింది. ఏదైనా వీళ్లయినా హ్యాపీగా ఉంటే చాలు అని చెప్పుకొస్తున్నారు.
Also Read
- Next Year Movies : 2027లో టాలీవుడ్లో రికార్డ్స్ మోత మోగనున్నాయా..
- Maremma Review: మారెమ్మ సినిమా రివ్యూ..
- Udaya Bhanu: 15 ఏళ్లుగా తపస్సు చేస్తున్నా.. ప్రశాంతంగా 2 గంటలు కూడా నిద్రపోలేదు.. ఉదయ భాను ఎమోషనల్ కామెంట్స్!
- Vrushakarma Release Update: 'వృషకర్మ' కీలక అప్డేట్.. ప్రభాస్‌ను ఢీకొట్టబోతున్న నాగ చైతన్య?
తాజావార్తలు
-
OTR : నెల్లిమర్ల నగర పంచాయతీలో ఛైర్మన్ సీటు పంచాయితీ
-
Pothireddypadu : పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ వద్ద భారీ ప్రమాదం.. తెగిపడిన 9వ గేటు
-
Gyanesh Kumar: ‘సర్’ ఫిర్యాదులు వచ్చే ఎన్నికల నాటికి పరిష్కరిస్తాం.. సీఈసీ కీలక వ్యాఖ్యలు
-
OTR: చిన్నారెడ్డి ఏం చేయబోతున్నాడు..?
-
Story Board : ఉద్యోగ నియామకాల్లో ఎక్కడ తేడా కొడుతోంది ? అన్ని రాష్ట్రాల్లో ఇంతేనా ?
ట్రెండింగ్
-
Sapta Jyotirlinga Darshan Yatra: 11 రోజులు.. 7 పవిత్ర జ్యోతిర్లింగాల దర్శన భాగ్యం..! సప్త జ్యోతిర్లింగ యాత్ర.. వివరాలు ఇదిగో.!
-
1980s Photo: మీ ఫొటో 1980s లుక్‌లో ఎలా ఉండేదో చూడాలా?.. ChatGPT ఇంగ్లీష్ ప్రాంప్ట్స్ ఇవిగో..
-
Meta Muse లాంచ్..! ఒక్క మాట చెబితే చాలు.. మీ తరఫున పనులు చేసే AI ఏజెంట్..!
-
Ishan Kishan Record: ఒకే మ్యాచ్‌లో 350 పరుగులు.. తొలి బ్యాటర్‌గా ఇషాన్ కిషన్ నయా చరిత్ర!
-
రూ.14,900కే Apple AirPods 5.. ANCతో అదిరిపోయే ఫీచర్లు.! ధర ఎంతంటే?