కోలీవుడ్ స్టార్ హీరోయిన్ వరలక్ష్మీ శరత్ కుమార్ చెన్నై నుంచి హైదరాబాద్ కి మకాం మార్చిన విషయం తెలిసిందే. ఇక్కడే ఒక ఇల్లు తీసుకున్న ఈ ముద్దుగుమ్మ ఇకనుంచి ఇక్కడే ఉండనున్నదట. క్రాక్ చిత్రంతో తెలుగులో మంచి పేరు తెచ్చుకునన్ వరలక్ష్మీ ఈ సినిమా తరువాత వరుస అవకాశాలను అందుకుంది. ఇక ఒక పక్క కోలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా కొనసాగుతుంటే టాలీవుడ్ లో తన ప్రత్యేకతను చాటుతుంది. అయితే సడెన్ గా అమ్మడు చెన్నై వదిలి రావడానికి కారణం ఏంటీ అనేది హాట్ టాపిక్ గా మారింది. వరూకు శరత్ కుమార్ కి మధ్య విభేదాలా.. అంటే అలాంటివేమీ లేవంటున్నారు కోలీవుడ్ వర్గాలు.
తండ్రి రెండో పెళ్లి చేసుకున్న రాధికా తో కూడా వరలక్ష్మీ సన్నిహితంగానే ఉంటుంది. విభేదాలు ఏమీ లేకుండానే ఎందుకు అక్కడ నుండి రావాల్సి వచ్చిందంటూ తెలుగు జనాలు చెవులు కొరుక్కుంటున్నారు. అయితే ప్రస్తుతం అందుతున్న సమాచారం బట్టి అమ్మడికి టాలీవుడ్ లో ఎక్కువ అవకాశాలు రావడం.. షూటింగ్ కోసం ప్రతిసారి చెన్నై నుంచి హైదరాబాద్ కి రావడం ఇబ్బందిగా మారిందని, అందుకే మొత్తానికే హైదరాబాద్ కి షిఫ్ట్ అయ్యిందని అంటున్నారు.. అడపాదడపా షూటింగులు కోసం చెన్నై కూడా ఇక్కడినుంచే వెళ్లనున్నదట. ఏది ఏమైనా పుట్టిపెరిగిన ఊరును, స్నేహితులను వదిలి మరో ఊరులో అడ్జెస్ట్ అవ్వడం అంటే కష్టమే అయినా పని కోసం తప్పదు కదా అంటున్నారు ఆమె అభిమానులు.