టాలీవుడ్ యంగ్ హీరో సందీప్ కిషన్, కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ సేతుపతి మల్టీస్టారర్ గా తెరకెక్కుతున్న చిత్రం ‘మైఖేల్’. పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న ఈ సినిమాకు రంజిత్ జయకోడి దర్శకత్వం వహిస్తున్నారు. తెలుగు, తమిళ్, మలయాళ, కన్నడ భాషల్లో ఈ సినిమా రూపొందుతోంది. ఇక ఇటీవలే ఈ చిత్రంలో ప్రముఖ దర్శకుడు గౌతమ్ వాసుదేవ్ మీనన్ విలన్ గా కనిపించనున్నాడు అని చెప్పి సినిమాపై భారీ అంచనాలు పెంచేశారు మేకర్స్. ఇక తాజాగా ఈ చిత్రంలో మరో ట్యాలెంటెడ్ బ్యూటీ అడుగుపెడుతున్నట్లు మేకర్స్ తెలిపారు. క్రాక్, నాంది చిత్రాలతో టాలీవుడ్ గోల్డెన్ లెగ్ అనిపించుకున్న వరలక్ష్మీ శరత్ కుమార్ ఈ చిత్రంలో కీలక పాత్రలో నటిస్తున్నట్లు మేకర్స్ తెలిపారు.
ఇక హీరో సందీప్ కిషన్ .. వరలక్ష్మీ ని పరిచయం చేస్తూ” నాకు ఇష్టమైన, మంచి వ్యక్తిని ‘మైఖేల్’ ప్రపంచంలోకి ఆహ్వానిస్తునందుకు ఆనందిస్తున్నాను. ఈ పాత్రలో మీ ఎంట్రీకి థియేటర్లలో రెస్పాన్స్ ఎలా ఉంటుందో ఇప్పటికే ఊహించాను” అంటూ చెప్పుకొచ్చి ఆసక్తి రేకెత్తించాడు. క్రాక్ లో జయమ్మ పాత్రలో వరలక్ష్మీ విశ్వరూపం చూపించింది. ఇక సందీప్ చెప్తున్న దాన్ని బట్టి చూస్తుంటే ఈ సినిమాలో కూడా ఒక పవర్ ఫుల్ రోల్ లో అమ్మడు కనిపించనున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే ఈ సినిమా సెట్ లో వరలక్ష్మీ అడుగుపెట్టనుంది. మరి ఈ సినిమాతో సందీప్ ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో చూడాలి.
Take pleasure in welcoming on board on one of favourite Humans/Actors @varusarath5 to the
— Sundeep Kishan (@sundeepkishan) January 20, 2022
World Of #Michael ??
I can already imagine the response in the theatres for your entry as this character ?❤️ pic.twitter.com/fGL5bgM3Zb