Varalakshmi Sarathkumar : ‘అర్జునుడి గీతోపదేశం’ చెబుతానంటున్న వరలక్ష్మీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Varalakshmi Sarathkumar New Movie Arjunudi Geethopadesham Started: టాలెంటెడ్ యాక్ట్రెస్ వరలక్ష్మి శరత్ కుమార్ మెయిన్ లీడ్ గా, అఖిల్ రాజ్, దివిజ ప్రభాకర్ ఇతర ప్రధాన పాత్రలలో సతీష్ గోగాడ దర్శకత్వంలో ఒక సినిమా అనౌన్స్ చేశారు. ఫస్ట్ కట్ ఫిల్మ్ ఫ్యాక్టరీ ప్రొడక్షన్ నెం#1 గా రూపొందనున్న సినిమాకి ‘అర్జునుడి గీతోపదేశం’ అనే టైటిల్ ఫిక్స్ చేశారు. త్రిలోక్ నాథ్.కె, ప్రదీప్ రెడ్డి.వి నిర్మిస్తున్న ఈ సినిమా పూజా కార్యక్రమాలతో గ్రాండ్ గా ప్రారంభమైంది. ముహూర్తపు సన్నివేశానికి కనుమెలి అమ్మిరాజు క్లాప్ కొట్టగా మల్లాల సీతారామరాజు కెమెరా స్విచాన్ చేశారు. త్రిలోక్ నాథ్, పూజిత స్క్రిప్ట్ అందించగా లక్కంశెట్టి వేణు గోపాల్ తొలిషాట్ కు గౌరవ దర్శకత్వం వహించారు. రాజీవ్, ఆదిత్య శశికుమార్ ఇతర కీలక పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి చరణ్ అర్జున్ సంగీతం అందిస్తుండగా, చైతన్య కందుల డీవోపీగా, అర్జున్ ఎడిటర్ గా పని చేస్తున్నారు.
Yediyurappa: యడ్యూరప్పపై లైంగిక దాడి కేసు.. దర్యాప్తును సీఐడీకి అప్పగింత
Also Read
మూవీ లాంచింగ్ ఈవెంట్ లో దర్శకుడు సతీష్ గోగాడ మాట్లాడుతూ.. దర్శకుడిగా ఇది నా తొలి సినిమా, ఈ కథ చెప్పినపుడు నటీనటులంతా చాలా పాజిటివ్ గా స్పందించారు, మార్చి 20 నుంచి మొదటి షెడ్యూల్ అమలాపురంలో మొదలు పెడుతున్నాం అని అని అన్నారు. వైజాగ్, హైదరాబాద్, చెన్నై లో తర్వాత షెడ్యూల్స్ ప్లాన్ చేస్తున్నామని అన్నారు. నిర్మాత మాట్లాడుతూ.. ఫస్ట్ కట్ ఫిల్మ్ ఫ్యాక్టరీ లో ఇది మొదటి సినిమా, సతీష్ చెప్పిన కథ చాలా అద్భుతంగా అనిపించిందని అన్నారు. ప్రేక్షకులందరినీ అలరించేలా ఈ సినిమా ఉంటుంది, అన్నారు రాజీవ్ మాట్లాడుతూ దర్శకుడు సతీష్ కి సినిమా అంటే చాలా పాషన్ అని అన్నారు. కథ చెప్పినప్పుడు చాలా ప్లజెంట్ గా అనిపించింది. మంచి క్యారెక్టర్ చేస్తున్నా, యంగ్ టీంతో ఈ సినిమా చేస్తున్నాం, మీ అందరి సపోర్ట్ కావాలన్నారు. దివిజ మాట్లాడుతూ చాలా మంచి కథ ఇది. ఇందులో లీడ్ రోల్ లో అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలకు ధన్యవాదాలు అని అన్నారు. వరలక్ష్మి శరత్‌కుమార్, అఖిల్ రాజ్, దివిజ ప్రభాకర్, రాజీవ్, ఆదిత్య శశికుమార్ తదితరులు కీలక పాత్రలలో నటిస్తున్నారు.
తాజావార్తలు
-
Sreeleela : శ్రీలీల బాలీవుడ్ తెరంగేట్రానికి ముహుర్తం ఎప్పుడు..?
-
Fake Certificate: గాడిద పేరు మీద నర్సింగ్ సర్టిఫికేట్.. పేరు ‘డంకీ’.. తండ్రి ‘డంకీ ఫాదర్’.. కులం ‘యానిమల్’..
-
Raashi Khanna : లీక్స్‌లో చిరంజీవినే మించిపోయింది రాశీ ఖన్నా
-
India vs West Indies 2nd ODI: సిరీస్ గెలుపే లక్ష్యంగా బరిలోకి భారత్.. సిరాజ్ రీఎంట్రీ.? ప్లేయింగ్ XI ఇలా..!
-
Road Tax vs Toll Tax: ఒకే కారుకు రెండు పన్నులా? రోడ్ ట్యాక్స్, టోల్ ట్యాక్స్ మధ్య అసలు తేడా ఏంటి..?
ట్రెండింగ్
-
2K+ 165Hz AMOLED డిస్‌ప్లే, 50MP+50MP+32MP కెమెరాలు, 8,400mAh బ్యాటరీతో iQOO 16 5Gలాంచ్.. ధర ఎంతంటే.?
-
World Heart Day : గుండె జబ్బు వచ్చే ముందు ఈ చిన్న సంకేతాలు కనిపిస్తాయా.?
-
100HP టర్బో ఇంజిన్‌తో Renault Triber Turbo కొత్త వేరియంట్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
Rohit-Kohli: నేను కోహ్లీకి పెద్ద ఫ్యాన్.. కానీ ఇప్పుడు చాలా బాధగా ఉంది.. రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
మారిన లుక్, సరికొత్త ఫీచర్లతో Suzuki Hayabusa Special Edition లాంచ్.. ధరనే కాస్త ఎక్కువే.!