Site icon NTV Telugu

‘వాలిమై’ ట్రైలర్: అజిత్ హాలీవుడ్ రేంజ్ యాక్షన్

valimai

valimai

అజిత్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న క్షణం వచ్చేసింది. ఎన్నో రోజులుగా ‘వాలిమై’ ట్రైలర్ ని రిలీజ్ చేస్తారని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూసారు. ఇక తాజాగా ఆ ట్రైలర్ ని మేకర్స్ రిలీజ్ చేశారు. హెచ్ వినోత్ దర్శకత్వం లో తెరకెక్కుతున్న ఈ సినిమాను  జీ స్టూడియోస్ మరియు బోని కపూర్ లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా పోస్టర్స్, టీజర్ రిలీజ్ అయ్యి నెట్టింట రికార్డులు సృష్టించాయి. ఇక ట్రైలర్ విషయానికొస్తే.. హాలీవుడ్ యాక్షన్ సినిమాను తలపిస్తోంది.

“అర్జున్(అజిత్) ఒక పోలీసాఫీసర్.. చెన్నైలో జరిగే బైక్ దొంగతనాలు, వరుస హత్యల కేసును పై అధికారులు అతడికి అప్పగిస్తారు. వీటన్నింటిని చేస్తున్న విలన్ కార్తికేయను పట్టుకోవడానికి అర్జున్ రంగంలోకి దిగుతాడు. కానీ కార్తికేయా ఈ హత్యలన్నీ చేయించింది అర్జున్ అని నింద మోపి అతడిని సస్పెండ్ చేయిస్తాడు. దీంతో అర్జున్ కుటుంబం, స్నేహితులు అందరు దూరమవుతారు. ఇక పోలీస్ యూనిఫార్మ్ వదిలిన అర్జున్.. కార్తికేయను ఎలా పట్టుకున్నాడు..? ఈ టామ్ అండ్ జెర్రీ గేమ్ లో ఎవరు గెలిచారు..? చివరికి కార్తికేయను అర్జున్ పట్టుకొని తిరిగి పోలీస్ గా జాయిన్ అయ్యాడా ..? అనేది సినిమా చూసి తెలుసుకోవాలి. ట్రైలర్ కట్స్ మాత్రం అదిరిపోయాయని చెప్పాలి. అజిత్ మరియు కార్తికేయ ల పెర్ఫార్మెన్స్ ఈ చిత్రం లో హైలెట్ గా మారాయి. అజిత్ సరసన బాలీవుడ్ భామ హైమా ఖురేషి నటిస్తోంది. ఇక యువన్ శంకర్ రాజా మ్యూజిక్ గుస్సా బంప్స్ తెప్పిస్తే.. విజువల్స్.. బైక్ రేసింగ్ యాక్షన్ సీన్స్ హాలీవుడ్ సినిమాను తలపిస్తున్నాయి. మొత్తానికి ఈ ట్రైలర్ అజిత్ ఫ్యాన్స్ పండగ చేసుకొనేలా ఉంది. ఇక ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది జనవరి 13 వ తేదీన రిలీజ్ చేయనున్నట్లు తెలుస్తోంది.

Exit mobile version