Vadivelu : ఆ మూడో వ్యక్తి వల్లే ధనుష్‌తో నాకు గొడవలు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ 56వ సినిమా (D56) పూజా కార్యక్రమాలు మధురైలో అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. అయితే ఈ ఈవెంట్ లో లెజెండరీ కమెడియన్ వడివేలు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తమిళ, తెలుగు సినీ వర్గాల్లో తీవ్ర సంచలనంగా మారాయి. తన కెరీర్ లో ధనుష్‌తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకోవడం వడివేలుకి ఇదే తొలిసారి. ఈ అద్భుతమైన కాంబినేషన్ సెట్ అవ్వడానికి ఎందుకింత సమయం పట్టిందన్న విషయంపై వడివేలు స్వయంగా క్లారిటీ ఇస్తూ బాంబు పేల్చారు. “చాలా సుదీర్ఘ విరామం తర్వాత ధనుష్ తో కలిసి పనిచేసే అవకాశం నాకు దక్కింది. మా ఇద్దరి కలయికకు ఇంత గ్యాప్ ఎందుకు వచ్చిందని మీరంతా అడగొచ్చు. దానికి కారణం ఒక మూడో వ్యక్తి (థర్డ్ పర్సన్). ఆ వ్యక్తి సృష్టించిన అపోహల వల్లే మా మధ్య ఇన్నాళ్లూ గొడవలు (మిస్ అండర్ స్టాండింగ్స్) జరిగాయి” అని వడివేలు ఓపెన్ అయ్యారు. ఆ మూడో వ్యక్తి ఎవరన్నది ఇప్పుడు కోలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది.
మధురైలోని మారనాడు కరుప్పన్నస్వామి ఆలయంలో అభిమానుల కోలాహలం మధ్య ఈ చిత్ర పూజా కార్యక్రమాలు జరిగాయి. ఈ సందర్భంగా ధనుష్ ఏకంగా 18 అడుగుల భారీ కొడవలిని స్వామివారికి కానుకగా సమర్పించడం అందరినీ విస్మయానికి గురిచేసింది. పక్కా విలేజ్, రూటెడ్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి తమిళరసన్ పచ్చముత్తు దర్శకత్వం వహిస్తున్నారు. ‘రాయన్’ తర్వాత మరోసారి ఎస్.జె. సూర్య ఇందులో కీలక పాత్ర పోషిస్తుండగా, ప్రీతి ముకుందన్, విజయ్ కుమార్ ఇతర పాత్రల్లో నటిస్తున్నారు. సితార ఎంటర్టైన్మెంట్స్, ప్రైమార్క్ ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ భారీ చిత్రానికి సాయి అభ్యంకర్ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రం 2027 వేసవిలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రస్తుతం ఇండియన్ సినిమాలో అత్యంత బిజీగా ఉన్న నటుల్లో ధనుష్ ముందు వరుసలో ఉన్నారు. రాజ్‌కుమార్ పెరియసామి దర్శకత్వంలో ఆయన నటిస్తున్న యాక్షన్ డ్రామా ‘ఓం: చాప్టర్ 1’ (OM: Chapter 1). మమ్ముట్టి, సాయి పల్లవి, శ్రీలీల, నసీరుద్దీన్ షా లాంటి భారీ తారాగణంతో వస్తున్న ఈ ద్విభాషా చిత్రం వాస్తవానికి అక్టోబర్ 16న రావాల్సింది. కానీ, సూపర్ స్టార్ రజనీకాంత్ ‘జైలర్ 2’, హీరో సూర్య దీపావళి రిలీజ్ ‘సీన్’ చిత్రాలకు గౌరవమిస్తూ.. వారికి పోటీగా వెళ్లకూడదనే ఉద్దేశ్యంతో ధనుష్ తన సినిమాను వాయిదా వేసుకున్నారు. ఈ సినిమా కొత్త రిలీజ్ డేట్ త్వరలో ప్రకటించనున్నారు.
Also Read
- Alia Bhat : రూటు మార్చేసిన భన్సాలీ ..స్లిట్ స్కర్ట్, మునుపెన్నడూ చూడని గ్లామర్!
- Nayanathra : వయసుతో పనేముంది? కుర్ర హీరోతో లేడీ సూపర్ స్టార్ రొమాన్స్.. ఓటీటీలోకి వచ్చేసిన 'హాయ్'!
- TV Nandi Awards: తిరుపతి వేదికగా 'నంది' అవార్డుల వేడుక.. పరభాషా నటులపై ఆంక్షలు?
- Kaaka Update: సంక్రాంతి బరి నుంచి తగ్గేదేలే.. ‘కాకా’ పనులు షురూ!
తాజావార్తలు
-
Vadivelu : ఆ మూడో వ్యక్తి వల్లే ధనుష్‌తో నాకు గొడవలు!
-
SIR Row: ‘‘జ్ఞానేష్ కుమార్ క్లారిటీ ఇవ్వాలి’’.. బీజేపీ మిత్రపక్షాల డిమాండ్..
-
Trump-Jinping: జిన్‌పింగ్ టూర్ ఎఫెక్ట్.. రష్యా ఆంక్షల బిల్లు నుంచి చైనాకు మినహాయింపు!
-
Alia Bhat : రూటు మార్చేసిన భన్సాలీ ..స్లిట్ స్కర్ట్, మునుపెన్నడూ చూడని గ్లామర్!
-
Veeramani Case: ‘‘స్టాలిన్ సర్.. నోరు విప్పండి’’.. వీరమణి కేసుపై సీఎం విజయ్ కీలక వ్యాఖ్యలు..
ట్రెండింగ్
-
iPhone 18 Pro Max Review: ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? రూ.1.79 లక్షలు పెట్టి కొనాలా? వద్దా?
-
Beerakaya Pachadi: వేడివేడి అన్నంలోకి నెయ్యి వేసుకుని తింటే అమృతమే.. నోరూరించే “బీరకాయ రోటి పచ్చడి” చేసేయండిలా..!
-
IND vs WI: రోహిత్ శర్మ ముందు అరుదైన రికార్డులు.. సెంచరీ చేస్తే సచిన్ సరసన.!
-
Amazon నుంచి Meesho వరకు.. YouTube Shoppingలోకి కొత్త ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్స్!
-
itel ACE 4 Shine: రూ.1,059కే కొత్త ఫీచర్ ఫోన్.. టైప్-C ఛార్జింగ్‌తో పాటు అదిరిపోయే ఫీచర్లు.!