Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
  • English
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Movie News V Ramakrishna Jayanthi

V. Ramakrishna : మరపురాని రామకృష్ణ గానం!

Published Date :August 20, 2022 , 6:50 am
By Subbarao N
V. Ramakrishna  : మరపురాని రామకృష్ణ గానం!
  • Follow Us :
  • google news
  • google preferred source icon Add as a preferred
    source on google

మధురగాయకుడు ఘంటసాల వెంకటేశ్వరరావు తరువాత తెలుగు చిత్రసీమలో టాప్ స్టార్స్ కు కొంత సంకట పరిస్థితి ఎదురయింది. ఎందుకంటే అప్పటి దాకా యన్టీఆర్, ఏయన్నార్ ఇద్దరూ ఘంటసాల నేపథ్యగానంతోనే అపూర్వ విజయాలు చూశారు. ఘంటసాల లేని లోటు తీర్చలేనిది. అయితే ఆయనలాగే పాడే రామకృష్ణ దొరకడంతో యన్టీఆర్, ఏయన్నార్ చిత్రాలు ఆయన పాటతో కొంతకాలం సాగాయి. శోభన్ బాబు, కృష్ణంరాజు వంటివారు కూడా సీనియర్స్ బాటలో నడుస్తూ రామకృష్ణ నేపథ్యగానంతో పయనించారు. ఆ తరువాత కొన్ని పద్యాలు, శ్లోకాలు, పాటలు పాడటం కోసం అదే పనిగా రామకృష్ణనే ఎంచుకున్నవారు ఉన్నారు. అలా తన గాత్రంతో ప్రత్యేకంగా నిలిచారు రామకృష్ణ.

విస్సంరాజు రామకృష్ణ 1947 ఆగస్టు 20న విజయనగరంలో జన్మించారు. మధురగాయని పి.సుశీలకు స్వయానా అక్కకొడుకు రామకృష్ణ. వారి వంశంలోనే సంగీతాభిలాష ఉంది. అలా రామకృష్ణ సైతం సంగీతసాధన చేశారు. తమ ప్రాంతానికే చెందిన ఘంటసాల అంటే రామకృష్ణకు ఎంతో అభిమానం. ఆయన పాడిన పాటలనే అభ్యసిస్తూ సంగీతంలో పట్టు సాధించారు రామకృష్ణ. బి.యస్సీ, పూర్తయిన తరువాత తానూ ఘంటసాల లాగా గాయకుడు కావాలని ప్రయత్నాలు మొదలు పెట్టారు. ఆల్ ఇండియా రేడియోలో లలిత సంగీతంలో గళం వినిపించారు. అదే సమయంలో దుక్కిపాటి మధుసూదనరావు ‘విచిత్రబంధం’ నిర్మిస్తున్నారు. ఇందులో ఏయన్నార్ కు రెండు పాటలను రామకృష్ణతో పాడించారు. రామకృష్ణ పేరు వినగానే ఈ నాటికీ ‘విచిత్రబంధం’లో ఆయన సోలోగా పాడిన “చిక్కావు చేతిలో చిలకమ్మా…” పాటనే గుర్తు చేసుకుంటారు జనం. ఆ పై యన్టీఆర్ కు ‘ధనమా? దైవమా?’ చిత్రంలో తొలిసారి పాడారు రామకృష్ణ.

Also Read

  • Cannes 2026: కేన్స్ ఫెస్టివల్‌లో దేశీ గ్లామర్ షో.. ఖర్చులు చూసి షాక్ అవుతున్న నెటిజన్లు!
  • Sreeleela: తమిళనాడు కోడలిగా శ్రీలీల..? తాజా కామెంట్స్ హాట్ టాపిక్!
  • Ali : అలీ కీలక పాత్రలో కొత్త సినిమా ప్రారంభం!
  • NBK - Vivek Athreya : వివేక్ ఆత్రేయ సినిమాలో ‘బాలయ్య' డ్యూయల్ రోల్.. ఊచకోత అన్ లిమిటెడ్
Add as a preferred
source on google

యన్టీఆర్ అభినయానికి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గానానికి లంకె కుదిరింది. అయినా యన్టీఆర్ , రామకృష్ణను ప్రోత్సహిస్తూ ఏదో ఒక విధంగా పాడించేవారు. ముఖ్యంగా తన ‘దానవీరశూర కర్ణ’లో శ్రీకృష్ణుని పాత్రకు రామకృష్ణతోనే గానం చేయించారు. దాంతో పద్యాలకు రామకృష్ణనే న్యాయం చేయగలరు అనే పేరు లభించింది. ఆ తరువాత కూడా యన్టీఆర్ ‘శ్రీమద్విరాట్ వీరబ్రహ్మేంద్ర స్వామి చరిత్ర’లో తత్వాలు, పద్యాలు రామకృష్ణతోనే పాడించారు. ఆ సినిమాతో రామకృష్ణ పని అయిపోయిందని భావించినవారు సైతం ముక్కున వేలేసుకున్నారు. బాలు, రామకృష్ణ కలసి అనేక చిత్రాలలో పాడి అలరించారు. వారిద్దరి మధ్య మంచి స్నేహబంధం ఉండేది. తరువాతి రోజుల్లో అందరు హీరోలు బాలు గానంతోనే సాగినా, కొన్ని ప్రత్యేక గీతాలకు సంగీత దర్శకులు రామకృష్ణనే ఎంచుకొనేవారు. రామకృష్ణ భార్య జ్యోతి ఖన్నా కూడా గాయని. ఆమె కూడా కొన్ని చిత్రాలలో పాడారు. రామకృష్ణ, జ్యోతి కలసి తెలుగునేలపై అనేక పర్యాయాలు పాటల పందిళ్ళు వేసి అలరించారు.

రామకృష్ణ తరువాత కొన్ని చిత్రాలలో నటించారు. ఆయన తనయుడు సాయి కిరణ్ హీరోగా సినిమాల్లోనూ, సీరియల్స్ లోనూ మురిపించాడు. 2015 జూలై 16న రామకృష్ణ కన్నుమూశారు. ఇప్పటికీ రామకృష్ణ పేరు వినగానే ఆయన పాడిన ఆ నాటి మధురగీతాలు, పద్యాలు మన మదిలో మెదలక మానవు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Daana Veera Soora Karna
  • Ramakrishna Jayanthi
  • Ramakrishna Special
  • Singer Ramakrishna
  • Vichitra Bandham

తాజావార్తలు

  • AIADMK MLAs Support Vijay: అన్నాడీఎంకేలో భారీ చీలిక.. విజయ్‌ గూటికి 30 మంది ఎమ్మెల్యేలు..

  • Madhav Tiwari: నేను 4 ఓవర్లు బౌలింగ్ చేశా, ఇప్పటికీ నమ్మలేకపోతున్నా.. డీసీ ప్లేయర్ ఆనందం!

  • High Court: భర్తను కత్తితో పొడిచి చంపిన భార్య.. జస్ట్ రూ.500 జరిమానా విధించి నిర్దోశిగా తేల్చిన హైకోర్టు

  • Cannes 2026: కేన్స్ ఫెస్టివల్‌లో దేశీ గ్లామర్ షో.. ఖర్చులు చూసి షాక్ అవుతున్న నెటిజన్లు!

  • Palak Paratha Recipe: హెల్దీగా, టేస్టీగా చేసే సూపర్ సాఫ్ట్ ‘పాలక్ పరోటా’.. ఇంట్లోనే చేసేయండి ఇలా.!

ట్రెండింగ్‌

  • Samsung: సర్టిఫైడ్ రీ-న్యూడ్ ప్రోగ్రామ్‌ తో రిఫర్బిష్డ్ గెలాక్సీ S25, గెలాక్సీ A56 మోడళ్లను తీసుకొచ్చిన శాంసంగ్..!

  • 204HP పవర్, ADAS ఫీచర్లతో 2026 Skoda Kodiaq భారత్ లో లాంచ్.. ధర, ఫీచర్స్ ఇలా..

  • Ginger Candy: తాటి బెల్లం + అల్లం: గొంతు నొప్పి నుండి జీర్ణ సమస్యలకు.. చెక్ పెట్టే అద్భుత ఔషధం ‘అల్లం మురబ్బా’ ఇంట్లోనే చేసుకోండి ఇలా..

  • 8000mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్‌ప్లే, యాక్టివ్ కూలింగ్‌తో గేమింగ్ మాన్స్టర్.. REDMAGIC 11S Pro రాక!

  • PM Modi: ఆడంబరాలు వద్దు.. పొదుపు ముద్దు.! దేశాభివృద్ధి కోసం ప్రధాని 10 కీలక సూచనలు..

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions