Ustaad Bhagat Singh Pre Release Event LIVE : ‘ఉస్తాద్ భగత్ సింగ్’ జాతర.. నేడే ప్రీ-రిలీజ్ ఈవెంట్..

  • ఈరోజు హైదరాబాద్‌లో గ్రాండ్ ప్రీ-రిలీజ్ ఈవెంట్
  • ఇప్పటికే విడుదలైన ఉస్తాద్ భగత్ సింగ్ ట్రైలర్
  • పవన్ కళ్యాణ్ – హరీష్ శంకర్ కాంబోపై భారీ అంచనాలు
  • మ్యూజిక్, ట్రైలర్ తో ఇప్పటికే పెరిగిన హైప్
Ustaad Bhagath Singh

Ustaad Bhagath Singh

హరీష్ శంకర్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ నటిస్తున్న ఈ చిత్రంపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. విడుదలైన టీజర్, సాంగ్స్‌కు ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన రావడంతో, ఇప్పుడు అందరి కళ్లు ట్రైలర్‌పైనే ఉన్నాయి. ఈ మాస్ ఎంటర్‌టైనర్ ట్రైలర్‌ను శనివారం సాయంత్రం విడుదల చేశారు మేకర్స్.  అయితే.. సినిమా ప్రమోషన్లలో భాగంగా అత్యంత భారీ స్థాయిలో ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ను ప్లాన్ చేశారు. ఈరోజు  హైదరాబాద్‌లోని పోలీస్ గ్రౌండ్స్‌లో సాయంత్రం  ఈ వేడుక ప్రారంభం కానుంది. ఈ ఈవెంట్‌కు చిత్ర యూనిట్‌తో పాటు పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు హాజరయ్యే అవకాశం ఉండటంతో నగరంలో సందడి నెలకొంది.  మైత్రీ మూవీ మేకర్స్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో శ్రీలీల, రాశీ ఖన్నా హీరోయిన్స్ గా నటిస్తుండగా, దేవి శ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్నారు. ‘గబ్బర్ సింగ్’ తర్వాత పవన్-హరీష్ కాంబోలో వస్తున్న సినిమా కావడంతో బాక్సాఫీస్ వద్ద రికార్డులు తిరగరాయడం ఖాయమని ట్రేడ్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.