Ustad Bhagat Singh : డబ్బింగ్’లో బిజీగా పవన్ కళ్యాణ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సినీ ప్రియులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ‘ఉస్తాద్ భగత్ సింగ్’ చిత్రం కీలకమైన పోస్ట్ ప్రొడక్షన్ దశలోకి ప్రవేశించింది. శుభ ముహూర్తంలో డబ్బింగ్ పనులు ప్రారంభమయ్యాయి. తన శక్తివంతమైన రచన, మాస్ మెచ్చే సంభాషణలకు పేరుగాంచిన హరీష్ శంకర్ ను అభిమానులు ముద్దుగా ‘కల్ట్ కెప్టెన్’ అని పిలుస్తారు. ఆ పేరుకి తగ్గట్టుగానే ‘ఉస్తాద్ భగత్ సింగ్’ను కల్ట్ చిత్రంగా మలచడానికి శాయశక్తులా కృషి చేస్తున్నారు. ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలను దర్శకుడు హరీష్ శంకర్ వేగంగా ముందుకు తీసుకెళ్తున్నారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ త్వరలో డబ్బింగ్ కార్యక్రమాలలో పాల్గొననున్నారు. ఇది అభిమానులలో, సినీ ప్రేమికులలో మరింత ఉత్సాహాన్ని పెంచుతుంది.
Also Read:Chiranjeevi : ఆల్-టైమ్ రీజినల్ ఇండస్ట్రీ బ్లాక్‌బస్టర్ ‘మన శంకరవరప్రసాద్ గారు’
Also Read
- Mega Podcast: దశాబ్దం తర్వాత డిజిటల్ స్క్రీన్‌పై మెగా హోస్టింగ్.. ఆ రెమ్యునరేషన్ లెక్కలు ఏంది బాస్!
- Suriya: స్టేజ్‌పై డైరెక్టర్ రాజమౌళికే స్వీట్ షాక్ ఇచ్చిన స్టార్ హీరో సూర్య! వైరల్ అవుతున్న వీడియో...
- Ranabali Documentary: కథపై హైప్ పెంచుతుందా? ఆసక్తిని చంపేస్తుందా?.. రణబాలి డాక్యుమెంటరీ స్ట్రాటజీపై హాట్ డిబేట్!
- Slum Dog Glimpse: అమ్మ ఉన్నది అన్నం పెట్టడానికి, అడుక్కోవడానికి కాదు.. కన్నీళ్లు పెట్టిస్తున్న ‘స్లమ్ డాగ్’ గ్లింప్స్!
‘గబ్బర్ సింగ్’ వంటి సంచలన విజయం తరువాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, దర్శకుడు హరీష్ శంకర్ కలయికలో రూపొందుతోన్న చిత్రం కావడంతో ‘ఉస్తాద్ భగత్ సింగ్’పై అంచనాలు తారాస్థాయిలో ఉన్నాయి. మైత్రి మూవీ మేకర్స్ పతాకంపై నిర్మాతలు నవీన్ యెర్నేని, రవి శంకర్ యలమంచిలి ఎక్కడా రాజీ పడకుండా ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం నుంచి ఇప్పటికే విడుదలైన ‘దేఖ్ లేంగే సాలా’ గీతం శ్రోతలను ఉర్రూతలూగించింది. ‘ఉస్తాద్ భగత్ సింగ్’ చిత్రం యొక్క నిర్మాణాంతర కార్యక్రమాలు ప్రస్తుతం శరవేగంగా జరుగుతున్నాయి. ఈ చిత్రానికి సంబంధించిన కీలక అప్డేట్లను త్వరలోనే నిర్మాతలు వెల్లడించనున్నారు.
తాజావార్తలు
-
CM Revanth Reddy: రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు.. విద్య నుంచి ‘SIR’ వరకు ఫుల్ ఫైర్
-
Honor Smart Phone: 200MP కెమెరా, 11,000mAh బ్యాటరీ.. మార్కెట్లోకి కొత్త స్మార్ట్ ఫోన్ లాంచ్..
-
TG ECET: టీజీ ఈసెట్ 2026 ఫలితాలు విడుదల.. 96.04 శాతం ఉత్తీర్ణత..
-
Bhu Bharati: రైతులకు ఊరట.. భూ సమస్యలపై ప్రభుత్వం కీలక నిర్ణయం.!
-
El Nino : తెలంగాణలో సెప్టెంబర్ సెగ.. 2 రోజుల్లో మరో 2 డిగ్రీలు పెరిగే ఛాన్స్.!
ట్రెండింగ్
-
Flipkart Big Billion Days: Motorola నుంచి భారీ డీల్స్.. ఆ స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్స్ సుమీ.. డోంట్ మిస్.!
-
Traditional Karam Podi Recipes: అమ్మ చేతి రుచులు గుర్తొచ్చేలా.. వంటింట్లో తప్పక ఉండాల్సిన “కారప్పొడులు” సులువుగా చేసుకోండి ఇలా..!
-
Mysore Pak: క్రిస్పీగా, గుల్లగుల్లగా.. తిన్నా కొద్దీ తినాలనిపించే సాంప్రదాయ మైసూర్ పాక్ చేసేయండి ఇంట్లో సులువుగా ఇలా.!
-
Viral Video: ఛీ.. ఛీ.. ఇలాంటి వారిని ఏం చేసిన తప్పులేదు.! కిక్కిరిసిన రైలు కోచ్‌లో అందరు ఉండగానే మూత్ర విసర్జన..!
-
The Paradise Shankaranna: ‘పారడైజ్’లో ఆ నాలుగు నిమిషాలు.. తెలంగాణ రాజకీయాల్లో మాత్రం ఫుల్ టైమ్ రచ్చ..!