Ustaad Bhagat Singh: గెట్ రెడీ.. ఈరోజు ట్రైలర్, రేపు రచ్చ రచ్చే!

  • ఈరోజు సాయంత్రం ఉస్తాద్ భగత్ సింగ్ ట్రైలర్ రిలీజ్
  • మార్చి 15 లేదా 16న హైదరాబాద్‌లో ప్రీ రిలీజ్ ఈవెంట్
  • పవన్ కళ్యాణ్ డేట్ కోసం వెయిట్ చేస్తున్న మూవీ మేకర్స్
Ustaad Bhagat Singh Trailer

Ustaad Bhagat Singh Trailer

మెగా అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న మాస్ ఎంటర్టైనర్ ‘ఉస్తాద్ భగత్ సింగ్’ బాక్సాఫీస్ వద్ద సందడి చేయడానికి సిద్ధమైంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, మాస్ డైరెక్టర్ హరీష్ శంకర్ కాంబినేషన్‌లో వస్తున్న ఈ చిత్రంపై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఇప్పటికే విడుదలైన టీజర్, పాటలు సినిమాపై హైప్‌ను రెట్టింపు చేయగా, ఇప్పుడు చిత్ర యూనిట్ థియేట్రికల్ ట్రైలర్ రిలీజ్‌కు ముహూర్తం ఫిక్స్ చేసింది. మార్చి 14న, అనగా ఈరోజు సాయంత్రం 6 గంటల 30 నిమిషాలకి ట్రైలర్ రిలీజ్ చేస్తున్నట్టు అధికారికంగా ప్రకటించారు. ఈ సందర్భంగా రిలీజ్ చేసిన పవర్ స్టార్ కూల్ లుక్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఇక ఈ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ కోసం ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు అభిమానులు. చిత్ర యూనిట్ వర్గాల సమాచారం ప్రకారం.. మార్చి 15న హైదరాబాద్‌లోని యూసుఫ్ గూడ పోలీస్ గ్రౌండ్స్‌లో ఈ ప్రీ-రిలీజ్ వేడుక అత్యంత వైభవంగా జరగనుంది. ఒకవేళ ఆరోజు కుదరకపోతే మార్చి 16న మాత్రం పక్కా అంటున్నారు. ఎందుకంటే.. ఏపీ డిప్యూటీ సీఎంగా బాద్యతలు నిర్వరిస్తున్న పవన్ డేట్‌ను బట్టి ఈ ఈవెంట్‌ ఉండనుంది. ఈ ఈవెంట్‌కు పవన్ కళ్యాణ్‌తో పాటు చిత్రబృందం మొత్తం హాజరుకానున్నారు. ఈ ఈవెంట్‌లో పవర్ స్టార్ స్పీచ్ కోసం అభిమానులు వేయికళ్లతో ఎదురుచూస్తుండగా.. అభిమానులు భారీగా తరలివచ్చే అవకాశం ఉంది. ఉగాది కానుకగా మార్చి 19, 2026న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో ఈ చిత్రం గ్రాండ్‌గా విడుదల కానుంది. ‘గబ్బర్ సింగ్’ వంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత పవన్, హరీష్ శంకర్ కాంబో వస్తుండటంతో, థియేటర్ల వద్ద మరోసారి పూనకాలు ఖాయమని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి. మైత్రీ మూవీ మేకర్స్ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఈ చిత్రంలో శ్రీలీల, రాశిఖన్నా హీరోయిన్లుగా నటించారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తుండగా.. తమన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కోసం వర్క్ చేస్తున్నాడు.