Site icon NTV Telugu

Ustad Bhagat Singh : ఉస్తాద్ భగత్ సింగ్ రిలీజ్ డేట్ అప్పుడేనట..

Ustad

Ustad

Ustad Bhagat Singh : పవన్ కల్యాన్‌ హీరోగా వస్తున్న మోస్ట్ హైప్ ఉన్న మూవీ ఉస్తాద్ భగత్ సింగ్. హరీశ్ శంకర్ డైరెక్షన్ లో వస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. గతంలో వీరి కాంబోలో వచ్చిన గబ్బర్ సింగ్ ఎంత పెద్ద హిట్ అయిందో మనకు తెలిసిందే. ఇప్పుడు మరోసారి అలాంటి కాంబో రిపీట్ అవుతుందనే అంచనాలతో ఉన్నారు పవన్ ఫ్యాన్స్. పైగా ఇందులోనూ పవన్ కల్యాణ్‌ పోలీస్ ఆఫీసర్ పాత్రలోనే కనిపిస్తున్నాడు. స్పీడ్ గా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా రిలీజ్ డేట్ గురించే రకరకాల రూమర్లు వస్తున్నాయి. పవన్ నటించిన మరో మూవీ ఓజీ రిలీజ్ కు దగ్గర పడుతోంది. ఆ సినిమా అయిపోగానే ఉస్తాద్ ట్రెండ్ స్టార్ట్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ ఎప్పుడు రిలీజ్ అవుతుందా అని ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్న టైమ్ లో ఓ ఇంట్రెస్టింగ్ అప్డేట్ బయటకు వచ్చింది.

Read Also : Little Hearts : లిటిల్ హార్ట్స్ సంచలన రికార్డు.. ఈ ఏడాది ఇదే మొదటిసారి..

ఈ మూవీని డిసెంబర్ లోనే రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారంట. ఇదే విషయంపై హరీశ్ శంకర్ ఓ ఈవెంట్ లో రిపోర్టర్లతో మాట్లాడుతూ.. ‘సినిమాను కంప్లీట్ చేయడం వరకే నా పని.. దాన్ని ఎప్పుడు రిలీజ్ చేయాలన్నది నిర్మాతలే చూసుకుంటారు. నేను అయితే మోస్ట్ లీ డిసెంబర్ నెలలోనే వస్తుందని అనుకుంటున్నా’ అని తెలిపారు. దాన్ని బట్టి చూస్తుంటే ఈ సినిమా కచ్చితంగా డిసెంబర్ నెలలోనే రిలీజ్ అయ్యేలా కనిపిస్తోంది. ఈ మూవీ షూటింగ్ ఎలాగూ కంప్లీట్ కావడానికి వచ్చింది. కాబట్టి ఆలస్యం చేయకుండా డిసెంబర్ స్పేస్ ను వాడుకోవడానికి ఈ సినిమా రెడీ అవుతున్నట్టు తెలుస్తోంది. దీనిపై త్వరలోనే అప్డేట్ రాబోతోంది. ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ భారీ బడ్జెట్ తో నిర్మించింది. శ్రీలీల ఇందులో హీరోయిన్ గా చేస్తోంది.

Read Also : Spirit : ప్రభాస్ స్పిరిట్ గురించి సీక్రెట్ చెప్పిన సందీప్ రెడ్డి..

Exit mobile version