Urvashi Rautela: ఏపీ సీఎం పవన్ తో నటించడం ఆనందంగా ఉందా.. ఏమన్నావో అర్ధమవుతుందా.. ?

Urvasi

Urvasi

Urvashi Rautela: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ మల్టీస్టారర్ గా తెరకెక్కిన చిత్రం బ్రో. సముద్రఖని దర్శకత్వం వహించిన ఈ సినిమాను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మించింది. రేపు ఈ సినిమా రిలీజ్ కు రెడీ అవుతోంది. ఈ సినిమాలో తేజ్ సరసన కేతిక శర్మ నటిస్తుండగా.. ప్రియా ప్రకాష్ వారియర్ కీలక పాత్రలో నటిస్తోంది. ఇక ఈ సినిమాలో బాలీవుడ్ హాట్ బ్యూటీ ఊర్వశీ రౌతేలా ఒక ఐటెం సాంగ్ చేసిన విషయం కూడా తెల్సిందే. రెండు రోజుల క్రితం బ్రో ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించగా చిత్ర బృందం మొత్తం పాల్గొంది. ఆ ఈవెంట్ కు ఊర్వశీ కూడా హాజరయ్యింది. తాజాగా రేపు సినిమా రిలీజ్ కానున్న నేపథ్యంలో ఆమె చిత్రబృందానికి బెస్ట్ విషెస్ చెప్తూ ఒక ట్వీట్ వేసింది. ట్వీట్ అంతా బావుంది కానీ, ఒక్క విషయంలో మాత్రం ట్రోలర్స్ కు ఆహారంగా మారిపోయింది. అదేంటంటే.. పవన్ కళ్యాణ్ ను సీఎం అని అంటూ సంభోదించింది.

Kushi: సామ్ ను రౌడీ హీరో ఎక్కడా వదలడం లేదుగా

” గౌరవనీయులైన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రితో స్క్రీన్ స్పేస్‌ను పంచుకోవడం ఆనందంగా ఉంది. మా చిత్రం బ్రో ది అవతార్ రేపు జూలై 28 న ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతుంది. మరణం తర్వాత తన తప్పులను సరిదిద్దుకోవడానికి రెండవ అవకాశం ఇచ్చిన అహంకారి గురించిన కథ. అందర్నీ కలుద్దాం” అంటూ ట్వీట్ చేసింది. అంతే పవన్ ఫ్యాన్స్ ఊర్వశీని ఎత్తేస్తుంటే .. ట్రోలర్స్ మాత్రం.. పాప ఏమన్నావో తెలుస్తుందా.. ? అంటూ కామెంట్స్ పెడుతున్నారు. ఫ్యాన్స్ అందరు సీఎం.. సీఎం.. సీఎం అని అరిచేసరికి పవన్ సీఎం అనుకున్నదేమో అని చెప్పుకొస్తున్నారు. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియా సెన్సేషన్ గా మారిపోయింది.