సరిగ్గా అయిదేళ్ల క్రితం వరకూ సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీల్లో వీక్ ఇండస్ట్రీ ఏదైనా ఉందా అంటే అది కన్నడ ఫిల్మ్ ఇండస్ట్రీ మాత్రమే. తమిళ్ నుంచి సోషల్ కాజ్ ఉన్న సినిమాలు, మలయాళం నుంచి కంటెంట్ ఓరియెంటెడ్ సినిమాలు, తెలుగు నుంచి కమర్షియల్ సినిమాలు వస్తుంటే కన్నడ ఫిల్మ్ ఇండస్ట్రీలో అసలు ఎలాంటి సినిమాలు రూపొందుతున్నాయి? అక్కడ స్టార్ హీరోలు ఎవరు? వాళ్ల బడ్జట్స్ ఏంటి? అనే విషయాలు బయట ప్రపంచానికి అసలు తెలిసేవి కాదు. 2018లో ప్రశాంత్ నీల్-యష్ లు కలిసి KGF చాప్టర్ 1 అనే సినిమా చేసి, సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీ మాత్రమే కాదు ఎంటైర్ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ కన్నడ ఫిల్మ్ ఇండస్ట్రీ వైపు తిరిగి చూసేలా చేశారు. KGF 1తో పాన్ ఇండియా గుర్తింపు తెచ్చుకున్న కన్నడ ఫిల్మ్ ఇండస్ట్రీ, kgf చాప్టర్ 2, చార్లీ 777, అతడే శ్రీమన్నారాయణ, విక్రాంత్ రోణా, కాంతార సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ పాన్ ఇండియా హిట్స్ ని కొట్టింది.
ముఖ్యంగా కాంతార సినిమా కన్నడ ఫిల్మ్ ఇండస్ట్రీకి రెస్పెక్ట్ ని తెచ్చింది. అయిదేళ్ల గ్యాప్ లో నాలుగు పాన్ ఇండియా హిట్స్ ఇచ్చిన కన్నడ ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి ‘కబ్జా అనే మరో భారి బడ్జట్ సినిమా ఆడియన్స్ ముందుకి రాబోతుంది. కిచ్చా సుదీప్, ఉపేంద్రలు కలిసి నటిస్తున్న ‘కబ్జా’ మూవీపై కన్నడ సినీ అభిమానుల్లో భారి అంచనాలు ఉన్నాయి. ఈ మూవీ టీజర్ ఇప్పటికే రిల్లెజ్ అయ్యి KGFని గుర్తుకు తెచ్చింది. ఉపేంద్ర, సుదీప్ లు అద్భుతమైన యాక్టర్స్ అనే విషయం అందరికీ తెలిసిందే. ఇలాంటి యాక్టర్స్ కి సాలిడ్ కంటెంట్ దొరికితే ఎలా ఉంటుందో కబ్జా సినిమా చూపించబోతుంది. గ్యాంగ్ స్టర్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ మూవీ రిలీజ్ డేట్ ని త్వరలో అనౌన్స్ చేస్తామంటూ చిత్ర యూనిట్ ప్రకటించింది. ఉపేంద్రకి సౌత్ లో మంచి గుర్తింపు ఉంది, సుదీప్ కి పాన్ ఇండియా ఐడెంటిటీ ఉంది. అలాంటి ఇద్దరు కలిసి చేస్తున్న కబ్జా సినిమా KGF రేంజులో హిట్ అవుతుందేమో చూడాలి.