Upasana : గోల్డెన్ టెంపుల్ లో ప్రత్యేక పూజలు… చెర్రీ కోసమే !
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సతీమణి ఉపాసన కొణిదెల తాజాగా అమృత్ సర్ లోని గోల్డెన్ టెంపుల్ లో కన్పించారు. అక్కడ ఆమె భర్త చెర్రీ కోసం ప్రత్యేక పూజలు చేశారు. ఈ పూజకు సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఉపాసన “కృతజ్ఞతా భావంగా Mr.C అమృత్‌సర్‌లోని స్వర్ణ దేవాలయంలో లంగర్ సేవను నిర్వహించారు. ఆయన RC15 Rc షూటింగ్ లో బిజీగా ఉండడం మూలంగా, ఈ సేవలో చెర్రీ తరపున పాల్గొనే ప్రత్యేక హక్కు, అవకాశం నాకు లభించింది. రామ్ చరణ్, నేను మీ ప్రేమతో ఆశీర్వదించబడ్డాము. వినయంతో అంగీకరిస్తున్నాను” అంటూ గోల్డెన్ టెంపుల్ లోని ప్రత్యేక పూజ విషయాన్ని వెల్లడించింది. “ఆర్ఆర్ఆర్” రిలీజ్ కు ముందు రామ్ చరణ్, తారక్, రాజమౌళి అండ్ టీం అంతా గోల్డెన్ టెంపుల్ ని సందర్శించిన విషయం తెలిసిందే.
Read Also : Narayan Das K Narang : ప్రముఖ నిర్మాత కన్నుమూత
Also Read
- Vidya Balan: నెల్సన్ మార్క్ సర్ప్రైజ్.. ‘జైలర్ 2’లోకి విద్యాబాలన్ మాస్ ఎంట్రీ! ఫస్ట్ లుక్ వీడియో చూశారా?
- Rashmika Mandanna: “నేను ఫిష్ కాదు”.. ‘మైసా’ షూటింగ్‌పై రష్మిక కామెంట్స్ వైరల్!
- రష్మికను ఇలా ఎప్పుడూ చూడలేదు.. MYSAA టీజర్లో యాక్షన్ పీక్స్!
- The Paradise: నాని ‘ది ప్యారడైజ్’కు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్.. టికెట్ రేట్లు పెంపు, స్పెషల్ షోలకు ఓకే!
RRR సూపర్ సక్సెస్ తర్వాత రామ్ చరణ్ నెక్స్ట్ మూవీ దర్శకుడు శంకర్ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ ప్రాజెక్ట్ ను తాత్కాలికంగా RC15 అనే టైటిల్ తో పిలుస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం పంజాబ్ లో జరుగుతోంది. ఈ చిత్రంలో రామ్ చరణ్ డ్యూయల్ రోల్‌లో కనిపిస్తారని సమాచారం. కియారా అద్వానీ ఈ చిత్రంలో కథానాయికగా నటిస్తోంది. మెగా అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్న ఈ చిత్రానికి తమన్ సంగీతం, తిరు సినిమాటోగ్రఫీ అందించనున్నారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్ రాజు, శిరీష్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో అంజలి, జయరామ్, సునీల్, శ్రీకాంత్, నవీన్ చంద్ర సహాయక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ మూవీకి కథను కార్తీక్ సుబ్బరాజ్ రాయగా, జానీ మాస్టర్ కొరియోగ్రఫీ అందిస్తున్నారు.
As a mark of gratitude Mr.C hosted a langar seva at the golden temple in Amritsar.
I had the privilege & opportunity to represent him by participating in the seva as he was shooting for #RC15Rc & I feel blessed with with your love & accept it with humility @AlwaysRamCharan pic.twitter.com/Tz8GYDO4bx
— Upasana Konidela (@upasanakonidela) April 19, 2022
తాజావార్తలు
-
Virat Kohli: సచిన్ టెండూల్కర్ ఆల్-టైమ్ రికార్డుపై కన్నేసిన విరాట్.. కోహ్లీ ముందు 3 భారీ మైలురాళ్ళు..!
-
Inverter Safety : ఇంట్లో ఇన్వర్టర్ ఉందా? దాని పక్కన ఈ వస్తువులు ఉంచితే పేలుడే..!
-
Lift Accident : లిఫ్ట్‌లో అడుగు పెట్టగానే మృత్యు ఉచ్చు.. గంటన్నరపాటు హైడ్రా రెస్క్యూ!
-
IPS Transfers: ఏపీలో భారీగా ఐపీఎస్ అధికారుల బదిలీలు.. వివరాలిలా..
-
Vidya Balan: నెల్సన్ మార్క్ సర్ప్రైజ్.. ‘జైలర్ 2’లోకి విద్యాబాలన్ మాస్ ఎంట్రీ! ఫస్ట్ లుక్ వీడియో చూశారా?
ట్రెండింగ్
-
Asian Games 2026: బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం.. బంగారు పతకం కొసం ఫైనల్లో శ్రీలంకతో అమితుమీ.!
-
200MP + 200MP కెమెరాలు, 8,500mAh బ్యాటరీతో వచ్చేస్తున్న Xiaomi 18 Pro సిరీస్..!
-
Shafali Verma: ఆకాశమే హద్దుగా సిక్సర్ల సునామీ.. షఫాలీ వర్మ అద్భుత సెంచరీ..! బంగ్లాకు భారీ టార్గెట్!
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!