Upasana Konidela:మెగా కోడలిగా ఉపాసన కొణిదెలకు ఉన్న మంచి గుర్తింపు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఒక పక్క ఇంటిని, ఇంకోపక్క అపోలోని సమర్థవంతంగా నడిపిస్తూ మెగా కోడలు అనిపించుకుంటుంది. ఒకప్పుడు ఆమె లుక్స్ ను ట్రోల్ చేసినవారే.. ఇప్పుడు ఆమె వ్యక్తిత్వాన్నకి చేతులు ఎత్తి దండం పెడుతున్నారు. ఇక పదేళ్ల తరువాత చరణ్- ఉపాసన తమ మొదటి బిడ్డ కోసం ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం ఉపాసన గర్భవతి అన్న విషయం తెల్సిందే. ఇక ఈ విషయం తెల్సిన దగ్గరనుంచి ఒక పక్క చరణ్, ఇంకోపక్క మెగా కుటుంబం ఆమెను ఎంతో జాగ్రత్తగా చూసుకుంటున్నారు. ఒక్క క్షణం కూడా చరణ్, ఉపాసనను వదిలి ఉండడం లేదు. ఇక గత కొన్నిరోజులుగా ఈ జంట తమ మొదటి బిడ్డ కోసం అమెరికా వెళ్తున్నట్లు వార్తలు వినిపించాయి. అత్యంత అనుభవం ఉన్న అమెరికా డాక్టర్లు.. ఉపాసనకు ప్రసవం చేయనున్నట్లు వార్తలు వచ్చాయి. అయితే ఆవార్తలను ఉపాసన ఖండించింది. తమ బిడ్డ ఇండియాలోనే పుట్టబోతున్నట్లు తెలిపింది.
Naga Shourya: వారితో రోడ్డుపై నాగ శౌర్య రచ్చ.. సారీ చెప్పు ముందు అంటూ
ట్విట్టర్ వేదికగా.. ” డాక్టర్ జెన్నిఫర్ ఆష్టన్ మీరు చాల స్వీట్. మిమ్మల్ని కలవడానికి నేను ఎంతగానో ఎదురుచూస్తున్నాను.
అపోలో హాస్పిటల్స్ లో ఓబీ-గైనకాలజిస్ట్ బృందంలో డాక్టర్ సుమనా మనోహర్ – డాక్టర్ రూమా సిన్హా తో పాటు మీరు కూడా ఇండియాలో జరిగే మా బిడ్డను ప్రసవించే సమయంలో ఉండడానికి ఒప్పుకున్నందుకు నేను ఎంతో సంతోషిస్తున్నాను. ఇది మా జీవితంలో ఎంతో అద్భుతమైన దశ” అని చెప్పుకొచ్చింది. దీంతో కొణిదెల వారసుడు పుట్టేది అమెరికాలో కాదు.. ఇండియాలోనే అది అపోలోలోనే అని ఉపాసన కన్ఫర్మ్ చేసింది. దీంతో అభిమానులు ఆ క్షణం త్వరగా రావాలని కోరుకుంటున్నారు. ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట వైరల్ గా మారింది.
