Unstoppable With NBK: మేము తప్పు చేయలేదు.. తల వంచం.. ప్రోమో అదిరింది
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Unstoppable With NBK:నందమూరి బాలకృష్ణ.. హీరోగా, రాజకీయ నాయకుడిగా అందరికీ తెలుసు. కానీ, ఆయనను చాలా దగ్గరగా చూడడం చాలా రేర్ గా జరిగేది. ఏదైనా సినిమా ఈవెంట్స్ లోనో, ఇంటర్వ్యూలోనో.. ఆయన మాట్లాడుతూ ఉండడం తప్ప బుల్లితెర ప్రేక్షకులకు అంతగా పరిచయం ఉండేది కాదు. కానీ, ఒక్క షో.. ఒకే ఒక్క షో.. బాలయ్యను అందరిని దగ్గర చేసింది. చిన్నా, పెద్ద అని తేడా లేకుండా బాలయ్య పేరు మారుమ్రోగిపోయేలా చేసింది.. అన్ స్టాపబుల్. ఈ షో మొదలైనప్పుడు.. బాలయ్య హోస్ట్ అంటే.. అందరు.. బాలయ్య షో ఎలా చేయగలడు.. ? తడబడతాడు.. కోప్పడతాడు అని చెప్పుకొచ్చారు. కానీ.. ఒక్కసారి షో మొదలయ్యాక అనుమానాలు అన్ని పటాపంచలు అయ్యాయి. అన్ స్టాపబుల్ సీజన్ 1 బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. ఇక ఇదే జోరుతో సీజన్ 2 తో వచ్చాడు. స్టార్ హీరోలతో పాటు.. రాజకీయ నాయకులు కూడా ఇందులో పాల్గొన్నారు. ఇప్పుడు మూడో సీజన్ తో బాలకృష్ణ రావడానికి రెడీ అయ్యాడు. తాజాగా ఈ మూడో సీజన్ ప్రోమోను మేకర్స్ రిలీజ్ చేశారు. లిమిటెడ్ ఎడిషన్ గా వస్తున్న ఈ సీజన్ లో భగవంత్ కేసరి టీమ్ సందడి చేశారు.
OMG 2 : తెలుగు లో రీమేక్ కాబోతున్న ఓ మై గాడ్ 2..?
Also Read
అనిల్ రావిపూడి, కాజల్, శ్రీలీల, అర్జున్ రాంపాల్.. తో అన్ స్టాపబుల్ వేదిక కళకళలాడింది. మేము తప్పు చేయలేదు అని మీకు తెలుసు.. తల వంచం అని మీకు తెలుసు.. నన్ను ఆపడానికి ఎవడు రాలేడని మీకు తెలుసు.. అనిపించింది అందాం.. అనుకున్నది చెద్దాం.. ఎవడు ఆపుతాడో చూద్దాం” అని ప్రోమో మొదలైంది. ఇక అనిల్ రావిపూడి తో బాలయ్య ఒక ఆట ఆడుకున్నాడు. ఇక కాజల్, శ్రీలీల ఎంట్రీ ఇవ్వడం.. కాజల్ ను మోక్షజ్ఞతో నటిస్తావా అని అడగడం ఆకట్టుకున్నాయి. బాలయ్య సెన్సాఫ్ హ్యూమర్ నచ్చి.. అనిల్ రావిపూడి.. బాలయ్యతో కామెడీ సినిమా చేస్తాను అని మాట ఇచ్చాడు. ఇక ఇదే వేదికపై తమన్నాతో అనిల్ రావిపూడి గొడవ గురించి అడగ్గా.. బాలకృష్ణ కాదు పిట్టింగ్ కృష్ణ అంటూ అన్నారు అనిల్ రావిపూడి. ఇక సినిమా, లైఫ్ అంత బావుంది అనుకున్నప్పుడు ఒకడు వస్తాడు నాశనం చేయడానికి.. అప్పుడు హీరో జైలు నుంచి వస్తాడు అని బాలయ్య చెప్పిన మాటలు చంద్రబాబు ను ఉద్దేశించి అన్నట్లు ఉన్నాయి. ప్రస్తుతం ఈ ప్రోమో నెట్టింట వైరల్ గా మారింది.
Mallochindu mana chicha
Marintha Allaritho, Marintha Sandhaditho…🤗
Full meals vachelopu, ee sweet promo enjoy cheyyandi!🔥#UnstoppableWithNBK Limited Edition, Premieres Oct 17 @ 6pm 🤟#NBKOnAHA #NandamuriBalakrishna @sreeleela14 @MsKajalAggarwal @rampalarjun @AnilRavipudi pic.twitter.com/HgFstkqGA6— ahavideoin (@ahavideoIN) October 13, 2023
తాజావార్తలు
-
Ganesh Immersion: హైదరాబాద్‌లో కొనసాగుతున్న గణేష్ నిమజ్జన శోభాయాత్ర.. ట్యాంక్‌బండ్ వైపు పోటెత్తిన గణనాథులు
-
Congo Plane Crash: ఘోర విమాన ప్రమాదం.. ఇద్దరు సీనియర్ సైనిక అధికారులతో సహా 14 మంది మృతి
-
CBSE Gets New Chairman: CBSEకి కొత్త ఛైర్మన్.. ఎవరీ మందీప్ భండారీ?.. పూర్తి వివరాలు ఇవే
-
Saturday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.. నేటి రాశిఫలాలు ఇలా.!
-
AFSPA Extension: మణిపూర్, నాగాలాండ్, అరుణాచల్‌ప్రదేశ్‌లో.. AFSPA మరో ఆరు నెలలు పొడిగింపు
ట్రెండింగ్
-
Nuclear Weapons: 12 వేలకుపైగా అణ్వాయుధాలు.. ప్రపంచానికి పొంచి ఉన్న ముప్పేంటి.?
-
iPhone 18 Pro Max Review: ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? రూ.1.79 లక్షలు పెట్టి కొనాలా? వద్దా?
-
Beerakaya Pachadi: వేడివేడి అన్నంలోకి నెయ్యి వేసుకుని తింటే అమృతమే.. నోరూరించే “బీరకాయ రోటి పచ్చడి” చేసేయండిలా..!
-
IND vs WI: రోహిత్ శర్మ ముందు అరుదైన రికార్డులు.. సెంచరీ చేస్తే సచిన్ సరసన.!
-
Amazon నుంచి Meesho వరకు.. YouTube Shoppingలోకి కొత్త ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్స్!