Site icon NTV Telugu

బాలయ్యతో తగ్గేదేలే అనిపించిన ‘పుష్ప’ రాజ్..

unstoppable

unstoppable

నందమూరి బాలకృష్ణ హోస్ట్ గా వవహరిస్తున్న అన్ స్టాపబుల్ ఆహా లో ఎంతటి రచ్చ సృష్టిస్తుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పెద్ద డైరెక్టర్లు, కుర్ర హీరోలు అని లేకుండా అందరితోను బాలయ్య పంచ్ లు, జోకులు, వారితో ఆటలు ఆడించడం, వారి చేత కొత్త సీక్రెట్లు బయటపెట్టించడం .. అబ్బో ఒక్కో ఎపిసోడ్ ఒక్కో డైమండ్. ఇక ఇప్పటికే 5 ఎపిసోడ్లు అద్భుతంగా పూర్తిచేసుకున్న ఈ టాక్ షో 6 వ ఎపిసోడ్ కి సిద్ధమైంది. ఈ ఎపిసోడ్ లో బాలయ్య పుష్ప టీమ్ తో సందడి చేయించనున్నారు. అయితే ఈ ఎపిసోడ్ క్రిస్టమస్ కానుకగా డిసెంబర్ 25 న స్ట్రీమింగ్ కావాల్సి ఉండగా.. కొన్ని అనివార్య కారణాల వలన వాయిదా పడింది.

https://ntvtelugu.com/bandla-ganesh-giving-a-strong-punch-to-minister-anil/

ఇక తాజాగా ఈ ఎపిసోడ్ నుంచి పోస్టర్ ని వదిలారు ఆహా మేకర్స్. ఈ పోస్టర్ లో పుష్ప రాజ్ తన మేనరిజం తగ్గేదేలే డైలాగ్ ని బాలయ్యతో కలిసి చేస్తున్నాడు. ఇక ఈ ఎపిసోడ్ లో రష్మిక , డైరెక్టర్ సుకుమార్ కూడా సందడి చేయనున్నట్లు తెలుస్తోంది. అయితే ఈసారి స్ట్రీమింగ్ డేట్ ని ఇవ్వకపోవడంతో అభిమానులు కాస్త అసహనాన్ని వ్యక్తం చేస్తున్నారు. మరి అభిమానులందరూ ఎంతగానో ఎదురుచూస్తున్న ఈ ఎపిసోడ్ ఎప్పుడు స్ట్రీమింగ్ అవుతుందో చూడాలి.

Exit mobile version