NTV Telugu Site icon

Marco : హిందీలో ఉచకొత కోస్తున్నఉన్నిముకుందన్ ‘మార్కో’

Marco

Marco

2024లో చిన్న సినిమాలతో మెరుపులు మెరిపించిన ఇండస్ట్రీ ఏదైనా ఉందంటే అది మలయాళ చిత్ర పరిశ్రమే. ఇయర్ స్టాటింగ్ నుండి ఎండింగ్ వరకు నాన్ స్టాపబుల్‌గా ఎంటర్ టైన్ చేసింది. ఇప్పటి వరకు సౌత్ కు మాత్రమే పరిమితమైన మలయాళ మ్యాడ్ నెస్ ఇప్పుడు నార్త్ బెల్ట్ కు పాకింది. హిందీ ఇండస్ట్రీని ఓ మూవీ దడదడలాడిస్తుంది. మాలీవుడ్ రీసెంట్ యాక్షన్ థ్రిల్లర్ ‘మార్కో’ మలయాళ ఇండస్ట్రీలోనే కాకుండా నార్త్ బెల్ట్‌లో కూడా దూసుకెళుతుంది. గత ఏడాది డిసెంబర్ 20న హిందీ డబ్బింగ్ వర్షన్ రిలీజ్ కాగా  ఓవర్ వయలెన్స్, తీవ్రమైన రక్తపాతంతో సినిమా నిండిపోయిందన్న విమర్శలు వచ్చినప్పటికీ ఈ మాస్ చిత్రానికి హిందీ ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. ఈ సినిమాతో పాన్ ఇండియన్ హీరోగా అవతరించాడు ఉన్ని ముకుందన్.

Also Read : SSMB 29 : ఒక్క ఫోటో చాలు.. సోషల్ మీడియా తగలబడిపోద్ది

సౌత్ లో మంచి పేరున్న నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు ఉన్ని ముకుందన్. కానీ కెరీర్ సాఫీగా సాగిపోతున్న సమయంలో లైంగిక వేధింపుల కేసు ఎదుర్కొని విమర్శల పాలయ్యాడు. కానీ ఇది తన కెరీర్ ను ఆపలేకపోయింది. ఆ తర్వాత బిగ్గెస్ట్ హిట్స్ అందుకున్నాడు. మెప్పాడియన్, మాలికాపురంతో వంద కోట్ల క్లబ్ లోకి చేరాడు. ఇప్పుడు మార్కో కూడా వంద కోట్ల దిశగా పయనిస్తోంది. తెలుగు, తమిళ్ వర్షన్లు రిలీజ్ కావడంతో ఈ నంబర్ క్యాచ్ చేసేట్లే కనిపిస్తోంది.సౌత్ నుండి ఒక్కొక్కరుగా పాన్ ఇండియన్ హీరోలుగా మారుతున్న టైంలో ఈ జాబితాలోకి రీసెంట్లీ ఎంటరయ్యాడు ఉన్ని ముకుందన్. నార్త్‌లో మార్క్ కు పెరుగుతున్న క్రేజ్, ఉన్ని ఇమేజ్ యష్ ను తలపిస్తుంది.   ఇప్పుడు మార్కోతో ఉన్ని ఐడెంటిటీ కూడా పూర్తిగా మారబోతున్నట్లే  కనిపిస్తోంది.

Show comments